సింగరేణిలో స్థానిక లారీలకు బొగ్గు లోడింగ్ ఇవ్వాలి…
సత్తుపల్లి లారీ యజమానుల ఆందోళనలకు …
మణుగూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘీభావం …
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 19:
సింగరేణి సంస్థల్లో స్థానిక లారీలకు బొగ్గు లోడింగ్ ఇవ్వాలని రోడ్డు మార్గాన బొగ్గు రవాణా పూర్తిగా తగ్గించాలనే సింగరేణి యాజమాన్యం పాలసీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సత్తుపల్లికి చెందిన స్థానిక లారీ యజమానులు చేస్తున్న ఆందోళనలకు మణుగూరు ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఆదివారం నాడు సమావేశమైన లారీ యజమానులు ఈ మేరకు తీర్మానాలు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,సింగరేణి యాజమాన్యం కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లిలో ఉత్పత్తి అయ్యే బొగ్గులో నలభై శాతం స్థానిక లారీల ద్వారా తరలించేందుకు అవకాశం కల్పిస్తామని,మీ ఉపాధికి ఎటువంటి డొకా ఉండదని బొగ్గు గనులు ఏర్పాటు సమయంలో సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చి ఇప్పుడు లారీలకు లోడ్ ఇవ్వకపోవడం వలన లారీల కొనుగోలుకు తెచ్చిన అప్పులు తీర్చలేక భార్య పిల్లలు వేసుకునే బంగారు ఆభరణాలు,ఇండ్లు, భూములు,తాకట్టు పెట్టి లారీలు నిలబెట్టి కిస్తీలు కట్టాలన్నా రోడ్డు టాక్సీలు ప్రభుత్వానికి చెల్లించాలన్నా సంవత్సరం తర్వాత లారీకి కట్టే ఇన్సూరెన్స్ కట్టుకోవాలన్నా,బ్రేకులు నేషనల్ పర్మిట్లు వేయించుకోవాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ,సత్తుపల్లి లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ యజమానులు వారి కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపినప్పటికీ ప్రజాప్రతినిధులు గాని సింగరేణి యాజమాన్యం కానీ స్పందించి వారికి సరైన
హామీ ఇవ్వకపోవడంతో ఆందోళనలకు ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని అసోసియేషన్లు సంఘీభావం తెలపడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా మణుగూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడా ఈరోజు సంఘీభావం తెలపడం జరిగిందన్నారు,ఈ కార్యక్రమంలో మిడిదొడ్ల నాగేశ్వరరావు,టి శ్రీను,వెంకన్న బాబు,లాలు, తాతబ్బాయి,అంజయ్య,రామకృష్ణ,మురళి,ఉప్పలయ్య, నాగయ్య,శ్రీను తదితరులు పాల్గొన్నారు.