నేటి గద్ధర్ న్యూస్,అల్లూరి సీతారామరాజు జిల్లా:
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట ,బాటసారులకు నీడను, చల్లదనాన్ని ఇచ్చే చెట్లకు క్రమంగా ప్రాణం తీస్తున్నారు. చెట్టు నరికేస్తే అధికారులు కేసు నమోదు చేస్తారన్న భయంతో కొందరు బెరడు తొలచి క్రమంగా వాటిని నిర్జీవం చేస్తున్నారు. కొద్ది పార్టీ రాజకీయం పలుకుబడి ఉన్న వాళ్ళు ఏకంగా నరికేస్తున్నారు. ఈ విషయం తెలిసి కూడా రోడ్లు భవనాల శాఖ అధికా రులు చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమ ర్శలు వినిపిస్తున్నాయి. హుకుంపేట మండల కేంద్రంలో గత కొన్నేళ్లుగా అయిదు వృక్షాలకు మరణశాసనం చేశారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు ఉనికి లేకుండా చేస్తున్నాడు.అరకు నుంచి పాడేరు ప్రధాన రహదారికి విస్తరణ పేరిట అధికారులు మొత్తం చెట్లు నరికేశారు. అక్కడక్కడ తప్ప ఎక్కడా కొత్తగా మొక్కల పెంపకం చేపట్టలేదు. ఉన్న కొద్ది
పాటి చెట్లు ఉనికి లేకుండా చేస్తున్నారు.
గుండు గీసినట్టు చెట్టులు కొమ్మలు బెరడును కొద్దిగా తీసివే యడం ద్వారా చెట్లు ఉసురు తీస్తున్నారు. ఈ కిటుకు తెలిసిన కొందరు దుండగులు తమరు అడ్డుగా ఉన్న చెట్టును తొలగించి దానికి ఈ ప్రక్రియ చేపడుతున్నారు. బెరడులో దారువు పోషక కణజాలం ఉంటాయి. బాలు వేళ్ల నుంచి మొక్క పైబా గానికి చేరుతాయని, పోషక జాలం వల్ల కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పత్రాలలో తయారైన ఆహార పదా ర్ధాలు (చక్కెరలు) మొక్క వేళ్ళ వరకు వెళతాయి. బెరడు తొలగించదాన్ని. వృక్షశాస్త్ర పరిభాషలో గరడలింగ్ అంటారు. బెరడు తొలగించటం ద్వారా మొక్కడు కావల్సిన పోష కాలు అందక వీరసపడే చెట్టు నెమ్మదిగా జీవం కోల్పోతుందని పలువురు తెలిపారు.హుకుంపేట మండలంలోనూ చెట్లను కూల్చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం పరుస్తున్నారు.