నేటి గద్దర్ న్యూస్,ములుగు/మంగపేట, (మే 19):
ములుగు జిల్లా, మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి – ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య ఆకస్మికం తనిఖీ చేశారు. ఈ తనిఖీ చేస్తున్న వైద్యాధికారి అప్పయ్య సందర్భంగా ఆసుపత్రిలోని . వైద్య సిబ్బంది హాజరు పట్టిక, మందుల స్టాక్ వివరాలు, రక్త పరీక్షల కేంద్రాన్ని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ వైద్య సిబ్బంది స్థానికంగా ఉండి రోగులకు సేవ లందించాలని విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటా యన్నారు. అక్కడ నుండి రాజుపేటలో కొత్తగా నిర్మించిన హెల్త్ బిజినెస్ సెంటర్ భవనాన్ని సందర్శించి వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన వెంట వైద్యాధికారి కారం నిఖిల్, హెల్త్ ఎడ్యుకేటర్ జయశ్రీ, ఏఎన్ఎం, ఆశ లు పాల్గొన్నారు.
Post Views: 143