ఉమ్మడి ఖమ్మం -వరంగల్ -నల్గొండ పట్టభద్రుల కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను భారీ మెజారిటీ తో గెలిపించాలని
★కన్నాయిగూడెం మండల ప్రజలను కోరిన మండల అధ్యక్షులు – అప్సర్ పాషా
నేటి గద్దర్ న్యూస్,ములుగు/ కన్నాయిగూడెం:(మే 19).
మంత్రివర్యులు సీతక్క ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పైడకుల అశోక్ సూచనల మేరకు కన్నాయిగూడెం మండల పట్టా భద్రులను మల్లన్న ను భారీ మెజారిటీతో గెలిపించాలని కన్నాయిగూడెం మండల్ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు ఎండీ అప్సర్ పాషా కోరారు.కన్నాయిగూడెం మండల కేంద్రంలో మండల కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథి మండల అధ్యక్షులు ఎండీ అప్సర్ పాషా హాజరై మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ – ఖమ్మం – నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ని గెలిపించాలని చదువుకున్న యువతను కోరారు.ఈ సందర్భముగా మండల్ అధ్యక్షులు అప్సర్ పాషా మాట్లాడుతూ గత పదేండ్ల పాలనలో దొరల అహంకారం, అక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర తెలంగాణ యువత భవిష్యత్తు నిర్వీర్యం అయిందని, యావత్తు తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇస్తే, బి.ఆర్.ఎస్.పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తులను కొల్లగొట్టి, విద్య, ఉద్యోగాలు లేకుండా యువతను మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఐదు నెలల్లో కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత పద్ధతిలో ఎంపిక చేసింది, మెగా డిఎస్సీ వేసింది, ములుగులో వైద్య కళాశాల ప్రారంభం చేసి, వైద్య కళాశాల యందు అలాగే ఆరోగ్య శాఖా యందు కూడా ఉద్యోగ భర్తీ చేపట్టిందని అన్నారు. తీన్మార్ మల్లన్న గారు కూడా ప్రశ్నించే గొంతుక అని, గత ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ఎప్పటికప్పుడు ప్రశ్నించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు అని, ప్రజల కష్టాలను, నష్టాలను అంచనా వేసిన వ్యక్తి కనుక ప్రతి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న అని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం మండల్ జడ్పీటీసీ నామ కరం చందు, వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్ కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అబ్బు రమేష్ మండల్ sc సెల్ అధ్యక్షులు సునార్కని రాంబాబు జిల్లా టీపీసీసీ మీడియా కో కో ఆర్డినేటర్ సునార్కని సాంబశివ కన్నాయిగూడెం టౌన్ అధ్యక్షులు మంగళరాపు సత్యం మండల్ యూత్ అధ్యక్షులు బోట నాగేష్ మండల్ కో ఆర్డినేటర్ దుర్గం ప్రభాకర్ మాజి ఎంపీటీసీ తడకల మధుకర్ మండల్ కాంగ్రేస్ నాయకులు చిదరీ సుమన్ మండల్ st సెల్ ఉపాధ్యక్షులు చేర్ప పగిడయ్య మల్లేష్ రాజబాబు యూత్ నాయకులు సత్యనారాయణ శ్రీధర్ బుద్దె నరేందర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.