కమలాపురం ప్రధాన రహదారిలో చెట్లు కూలిపోయిన దృశ్యం…
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 19:
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కమలాపురం ప్రధాన రహదారిలో మద్యం మత్తులో ఇసుక లారీలు తోలుతూ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్టుని ఢీకొనడంతో అక్కడ చెట్టు వేలమట్టమైనది. చిన్నరావి గూడెం ఇసుక ర్యాంపుకు వెళుతున్న లారీలు అతివేగంతో వెళ్లడమే కాకుండా మద్యం మత్తులో ఇసుక లారీలను తోలడం వలన చెట్లే కాకుండా గతంలో అనేకసార్లు పశువుల ప్రాణాలను కూడా బలి తీసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇసుక ర్యాంపు యాజమాన్యానికి ధనార్జనే తప్ప పర్యావరణం,పశువుల ప్రాణాలను పట్టించుకునే పరిస్థితి లేదని పలువురు ఆరోపిస్తున్నారు.మద్యం మత్తులో ఇసుక లారీలను తోలుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Post Views: 397