రూ. 3.78లక్షల విలువగల గంజాయి పట్టివేత
నేటి గదర్, మే 22, బూర్గంపాడు / భద్రాద్రి కొత్తగూడెం :
ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న సుమారు 3.78 లక్షల విలువ గల గంజాయిని పట్టుకున్నట్లు బూర్గంపాడు ఎస్ఐ సుమన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మంగళవారం సాయంత్రం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో బూర్గంపాడు ఎస్ఐ తన సిబ్బందితో కలిసి సారపాక సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక మోటార్ సైకిల్ భద్రాచలం వైపు నుంచి అత్యధిక వేగంతో వస్తుండగా సారపాక లోని పల్లె ప్రకృతివనం దగ్గర దాన్ని ఆపి, ఆ వ్యక్తి దగ్గర ఉన్న బ్యాగులను సోదా చేయగా 15.15 కేజీలు గంజాయి దొరికినట్లు ఎస్సై సుమన్ తెలిపారు. పట్టుబడిన వ్యక్తి చింతూరు మండలం అల్లిగూడెం గ్రామానికి చెందిన తునికి లక్ష్మయ్య @ లక్ష్మణ్ అని పేర్కొన్నారు. పట్టుబడిన మొత్తం గంజాయి సుమారు 15.15 కేజీలు, దాని విలువ సుమారు Rs.3,78,750/- ఉంటుంది ఆయన తెలిపారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తి వద్దనుండి TS28J9173 నెంబర్ గల పల్సర్ మోటార్ సైకిల్, ఒక మొబైల్ సీజ్ చేసి, ముగ్గురి మీద కేసు నమోదు చేసి, తునికి లక్ష్మణ్ ని రిమాండ్ నిమిత్తం కోర్ట్ లో హాజరు పరిచినట్లు వెల్లడించారు.