– డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్
నేటి గదర్, మే 22, బోనకల్ ప్రతినిధి :
ఈనెల 27న జరిగే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలిపించాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పట్టభద్రులకు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ శ్రేణులు సమన్వయ సమావేశం మండల కాంగ్రెస్ పార్టీ గాలి దుర్గారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ పట్టభద్రులకు కాంగ్రెస్ పార్టీతోనే మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కాంగ్రెస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి అసమర్థత వలన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చిందని విమర్శించారు. పట్టభద్రులను పల్లా మోసం చేశాడని ఆక్షేపించారు. తీన్మార్ మల్లన్న ను గెలిపించి పట్ట భద్రులు తమకు అండగా తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించే గొంతుక సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మద్దతు ప్రకటించిన నిరుద్యోగుల ఆశాకిరణం తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. రాష్ట్రంలో ఏ సమస్య పట్లైనా అవగాహన కలిగి నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సముచిత న్యాయం చేసే ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న ను మండలికి పంపితే అన్ని సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ సమాజంలో ఖమ్మం టౌన్ కాంగ్రెస్ నాయకులు జావీద్, టీపీసీసీ సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్, డిసీసీ కార్యదర్శి బంధం నాగేశ్వరావు, సిపిఎం సీనియర్ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శిదొండపాటి నాగేశ్వరరావు, సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఆకెన పవన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, కలకోట సొసైటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరావు, భూక్య సైదా నాయక్, బండి వెంకటేశ్వర్లు, బిపి నాయక్, భూక్య భద్రు నాయక్, పల్లిపాటి తిరుపతిరావు,అంతోటి వెంకటేశ్వర్లు, భాగం పాపారావు, చేబ్రోలు వెంకటేశ్వర్లు, గఫూర్ తదితరులు పాల్గొన్నారు.