పట్టపగలే కొల్లు నుండి మట్టి అక్రమ తోలకాలు…
చోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు…
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి అశ్వాపురం మే 29:
అశ్వాపురం మండల పరిధిలోని నెల్లిపాక గ్రామపంచాయతీ నెల్లిపాక బంజరు గోదావరి అనుసందానంగా ఉన్న కొల్లు నుండి అక్రమ మట్టి తోలకాలు జోరుగా సాగుతున్నాయి.ప్రోక్లైన్ లారీల సహాయంతో యదేచ్చగా పట్టపగలే అక్రమ మట్టి తోలకాలు జరుగుతున్న సంబంధిత మైనింగ్ ఇరిగేషన్ రెవిన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.ఓ గుత్తేదారి తన కాంట్రాక్టు పనుల నిమిత్తం కొల్లు నుండి మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ గుత్తేదారికి వత్తాసు పలుకుతున్నది ఎవరన్నది తెలియ రావడం లేదు.యంత్ర పరికరాలతో పట్టపగలే మట్టిని తోలుతున్నారంటే ఇక్కడ అధికారుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.అధికారిక క్వారీ నుండి తమ కాంట్రాక్టు పనుల నిర్వహణ కోసం మట్టిని తోలుకోవాల్సిన గుత్తేదారు కొల్లు నుండి అక్రమంగా మట్టి తోలుకోవడం ఏ మేరకు సమంజసం అని పలువురు మేధావులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు.ఇకనైనా మైనింగ్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే…