– గతంలోని సంఘటనల పట్ల నిర్లక్ష్యమే ఈ దారుణానికి కారణం
– విద్యార్థి మృతి పట్ల కాలేజీ యాజమాన్యం ఇప్పటివరకు కేసు ఎందుకు పెట్టలేదు
– కారుణ్య న్యాయం జరగాలి.. మరో విద్యార్థికి ఆ పరిస్థితి రావద్దు
– రౌండ్ టేబుల్ సమావేశంలో PDSU, MRPS, MPS
నేటి గద్దర్, మే 28, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :
(అలవాల వంశీ 9052354516)
భద్రాచలం మారుతి మెడికల్ కాలేజీలో ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన కారుణ్య మృతికి గల కారణాలు ఏంటో పారదర్శకంగా విచారణ జరిపించి నిజాలను వెల్లడించాలని PDSU, MRPS, MSP సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం భద్రాచలం పట్టణంలోని సిపిఐ మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో PDSU రాష్ట్ర కార్యదర్శి నామాల ఆజాద్, PDSU జిల్లా కార్యదర్శి కాంపాటి పృధ్వీ, MRPS జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా, MSP మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు లత మాట్లాడుతూ… కారుణ్య మృతికి కాలేజీ యాజమాన్యం కారణమంటూ కారుణ్య తల్లిదండ్రులు మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేసి ఇప్పుడు కాలేజీకి కారుణ్య మృతికి సంబంధం లేని చెప్పడం పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. కారుణ్య ఆత్మహత్యకు పాల్పడిందని, సూసైడ్ నోట్ దొరికిందని ఎన్నో వాదనలు కారుణ్య మృతి పట్ల వినిపిస్తున్నాయని ఒకవేళ కారుణ్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటే ఆత్మహత్యకు గల కారణాలేంటో వెల్లడించారని వారి డిమాండ్ చేశారు. మారుతి నర్సింగ్ కాలేజీ యాజమాన్యం తమ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందితే ఇప్పటివరకు తమ విద్యార్థి మృతి పై పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మారుతీ మెడికల్ కళాశాలలో గడిచిన 10 యేండ్ల కాలంలో దళిత ఆదివాసి కుటుంబాలకు చెందిన విద్యార్థినిలు లైంగిక వేధింపులు, అత్యాచారాలకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతూ అత్యాచారాలకు గురవుతున్నారు అని వారు ఆరోపించారు. మారుతి కళాశాలలో గతంలో జరిగిన మరణాల పట్ల కళాశాల సిబ్బంది,యాజమాన్య పాత్ర పై అనేక అనుమానాలు ఉన్నా సమగ్ర విచారణ జరగక పోవడంతో ఈ నిర్లక్ష్యపు కారణాలవల్ల నేడు విద్యార్థిని కారుణ్య మృతికి బలమైన కారణాలు అయ్యాయని వారు తెలిపారు. గతంలో మాదిరిగానే కారుణ్య మృతి రహస్యాలను కూడా బయటకు పొక్కకుండా కళాశాల యాజమాన్యం తమకు ఉన్న ఆర్థిక రాజకీయ అంగ బలాన్ని ఆసరాగా చేసుకుని కారుణ్య మృతిని పలు విధాలుగా తప్పు దోవ పట్టించేందుకు తీవ్ర ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే భద్రాచలం పట్టణం నడి ఒడ్డున మా బిడ్డ మృతికి మారుతి కళాశాల యాజమాన్యమే కారణం అని కారుణ్య తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆవేదనకు లోనై మాకు న్యాయం చేయండి అని వేడుకున్న వారిని తప్పుడు మార్గంలో వారికి డబ్బు ఎరవేసి వారి నోరులను కట్టివేశారని తెలిపారు. మీడియా సాక్షిగా వారు మా బిడ్డ మరణానికి మారుతి కళాశాల యాజమాన్యమే అని పలు రకాల వీడియోలు మన ముందు ఉన్నప్పటికీ రాత్రికి రాత్రే బాధితులతో తప్పుడు సాక్షాలను సృష్టించి బయటి సమాజానికి రాతపూర్వకంగా వారి బిడ్డ మరణానికి కళాశాల యాజమానికి ఏమి సంబంధం లేదని చెప్పించిన తీరు తీవ్ర ఆవేదన కలిగిస్తుందని వారు తెలిపారు. కారుణ్య కుటుంబం క్రిస్టియన్ మతస్తులని, క్రిస్టియన్ మతస్తులైన, ఒకవేళ హిందూమతస్తులైన 18 సంవత్సరాల లోపు పిల్లలను మృతి చెందుతే ఖననం చేస్తారు కానీ, దహనం చేయాలని వారు అన్నారు. కారుణ్య మృతి పట్ల భవిష్యత్తులో రీ పోస్టుమార్టం చేసే అవకాశం లేకుండా కుటుంబ సభ్యులతో కారుణ్య మృతదేహాన్ని దహనం చేయించారని ఆరోపించారు. అధికారులు కారుణ్య కారుణ్య మృతి పట్ల నిజాలను దాచిపెట్టి, జరగని వాటిని జరిగినట్లుగా సృష్టించి కారుణ్య మరణానికి కారణాలుగా చూపించే ప్రయత్నాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. మారుతి మెడికల్ కళాశాల విద్యార్థులు గతంలో సైతం అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటనలు ఉన్నాయని వాటిలో సైతం విద్యార్థుల మృతికి గల స్పష్టమైన కారణాలు ఇప్పటివరకు బహిర్గతం కాలేదని ఆరోపించారు. విద్యార్థి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటే విద్యార్థి శరీరంలో ఎముకలు విరిగే అవకాశం ఉందని, కారుణ్య విషయంలో అలా జరగలేదని వారు పేర్కొన్నారు. కారుణ్య శరీరంపై గాయాలు ఉన్నాయని, కారుణ్య మృతి పట్ల కారుణ్య తల్లిదండ్రులు మీడియా సమక్షంలో అనుమానం వ్యక్తం చేసిన మాటలను గుర్తు చేశారు. ఈ రోజున పట్టణంలోని కొందరు ప్రజాప్రతినిధులు కారుణ్య మృతికి గల కారణాలను డబ్బుతో మాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, కారుణ్య మృతికి గల స్పష్టమైన కారణాలు బహిర్గతం అయ్యేవరకు పోరాటం సాగిస్తామని వారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ నాయకులు శివాజీ, ఏజెన్సీ దళిత శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్, అనుసూచిత్ జాతి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను, కొంచర్ల కుమారి, గద్దల కృష్ణవేణి,ఎస్కే సల్మా, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్మగిరి వెంకటేశ్వర్లు మాదిగ, పింగళి నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.