+91 95819 05907

కారుణ్య బాడీ పై 35 గాయాలు అని చెప్పి ఆమె తల్లి ఎవరి ఒత్తిడితో మాట మార్చింది?హ్యూమన్ రైట్స్ సభ్యుడి సంచలనం వ్యాఖ్యలు

కారుణ్య మృతి పట్ల హ్యూమన్ రైట్స్ సభ్యుడి సంచలనం వ్యాఖ్యలు

నేటి గదర్, మే 30, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :

తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకు వెళ్లట్లేదని, చనిపోయిన విద్యార్థులు తల్లి, బంధువులు ఆరోజున మీడియా సమక్షంలో చేసిన ఆరోపణలకు, వ్యక్తం చేసిన ప్రశ్నలకు సమాధానం అడుగుతున్నామని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (NHRCOI) బోర్డు అడ్వైజరీ మెంబర్ గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం భద్రాచలం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కారుణ్య మృతి పట్ల ఉన్న పలు సందేహాలకు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సమాధానం దొరికే అవకాశం ఉందన్నారు. ప్రజలకు మా ద్వారా తెలిపేది, అధికారులను, కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించేది, డిమాండ్ చేసేది తప్పుడు సమాచారం కాదని.. సంఘటన జరిగిన రోజు మృతి చెందిన విద్యార్థిని తల్లి, బంధువులు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలకు సమాధానం కోరుతున్నామన్నారు. కారుణ్య పై దాడి జరిగిందని, 35 గాయాలు సైతం ఉన్నాయని చెప్పిన కారుణ్య తల్లి, ఆ తర్వాత కాలేజీకి కారుణ్య మృతికి ఎటువంటి సంబంధం లేదని సంతకం పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఒకవేళ కారుణ్య మృతి ఆత్మహత్య అయితే ఏం ఇబ్బంది వల్ల కారుణ్య ఆత్మహత్య చేసుకున్న అనే కోణంలో సైతం విచారణ జరిపించి ఆత్మహత్యకు మోటివ్ ఏమిటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మారుతి మెడికల్ కళాశాల నడుస్తున్న తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థిని మృతి పట్ల సిట్టింగ్ జడ్జితో పాటు, నేషనల్ నర్సింగ్ కౌన్సిల్ ద్వారా కమిటీ వేసి కాలేజీ ఏ విధంగా నడుస్తుంది అన్న విషయంపై సైతం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2012 నుండి నేటి వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు పదిమందికి పైగా విద్యార్థులు మృతి చెందారని ఆయన అన్నారు. మీడియా సమక్షంలో వీడియో రికార్డెడ్ గా కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మారుతి మెడికల్ కళాశాలలో ఇన్నాళ్లు హరాస్మెంట్ జరిగితే, ఇప్పుడు మ్యాన్ హ్యాండిల్ ఏం జరుగుతుంది అన్న ఆరోపణలపై స్పష్టత రావాలని వేణుగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !