బరితెగించిన ఇసుక దొంగలు
– విధుల్లో ఉన్న ఏఎస్ఐ పై దాడి
– దళితుడైన అధికారిపై దాడిని ఖండిస్తున్న పలువురు నాయకులు
నేటి గదర్, మే 30, డెస్క్ ప్రతినిధి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలో అక్రమ ఇసుక తోలకాలు నిర్వహిస్తున్న ఇసుక దొంగలు నానాటికి బరితెగించి అక్రమాలకు, ఆగడాలకు పాల్పడుతున్నారు. ఈ నేపద్యంలో మంగళవారం అర్ధరాత్రి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు బూర్గంపాడు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుమన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న సుమారు 6 ట్రాక్టర్లను పట్టుకొని చేసిన తరలించారు. కాగా బుధవారం ఇతర వ్యక్తులు వేరే కేసు పై పోలీస్ స్టేషన్లో ఉన్న తమ కారును రిలీవ్ చేయించుకునేందుకు ఇతర ప్రాంతం నుండి వచ్చిన వ్యక్తులతో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వ్యక్తులు గొడవ పడుతుండగా వారిని వారించేందుకు వచ్చిన ఏఎస్ఐ పై సదరు ఇసుక దొంగలు దాడికి దిగారు. కాగా ఏఎస్ఐ తనపై దాడి చేసిన వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ పై దాడికి పాల్పడిన నిమ్మల హరీష్, కన్నెబోయిన సారధి, ప్రసాద్, గుండె వెంకటేష్, మహేష్ అను వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు సమాచారం.
– దళిత ఏఎస్ఐ పై దాడిని ఖండిస్తున్న పలువురు నాయకులు
దళిత ఏఎస్ఐ పై అమానుషం
బూర్గంపాడు మండలంలో దళిత ఏఎస్ఐ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న దళిత ఏఎస్ఐ ని, కొట్టి వ్యక్తుల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం
– MRPS సీనియర్ నాయకులు అలవాల రాజా
పోలీసులకే భద్రత లేకపోతే సామాన్యులకు రక్షణ ఎట్లా
శాంతి భద్రతలు కాపాడే పోలీసులకే భద్రత లేకపోతే సామాన్య ప్రజలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారు. కాబట్టి వెంటనే ఏఎస్ఐ పై దాడికి పాల్పడిన వ్యక్తి, అతని అనుచరులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కొట్టడం అనేది అందులో ఒక దళిత అధికారి అని చిన్న చూపుతో దాడి చేయడం అనేది కాంగ్రెస్ నాయకుల ప్రవర్తన ఏ స్థాయికి దిగజారిందో ప్రజలందరికీ తెలియజేస్తుంది
– BRS పినపాక నియోజకవర్గం SC సెల్ అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్