★165 జంటలకు సామూహిక వివాహాలు
★ హాజరైన త్రిదండి చిన్న జీయర్ స్వామి
★ జిల్లా నలుమూలల నుండి హాజరైన చిన్న జీయర్ స్వామి వేలాది భక్తులు,మహిళలు
★ 20వేల మందికి మహా అన్నదాన కార్యక్రమం
★ అనంతారంలో పండుగ వాతావరణం
నేటి గద్ధర్ న్యూస్ ,ప్రత్యేక ప్రతినిధి(మణుగూరు):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో 165 జంటలకు సామూహిక వివాహాలు జరిగాయి.ఈ సామూహిక వివాహలకు త్రిదండి చిన్నజీయర్ స్వామి హాజరై వివాహ తంతును దగ్గరుండి జరిపించారు గురువారం మణుగూరు మండలం అనంతారం గ్రామంలో నిర్వహించిన 165 సామూహిక వివాహలు సామాజిక సేవ నాయకురాలు, దానధర్మ ట్రస్ట్ సభ్యురాలు గంట రాధ ఆధ్వర్యంలో జరిపించారు. ముందుగా 165 మంది జంటలకు హిందుత్వ సంప్రదాయం మేరకు ఆయా జంటలకు వివాహ తంతు జరిపించడం జరిగింది . అనంతరం చిన్న జీయర్ స్వామి భార్య, భర్తల దాంపత్యం గురించి నవ దంపతులకు వివరించారు. ప్రతి జంటను అక్షింతలతో ఆశీర్వదించారు. త్రిదండి చిన్నజీయర్ స్వామితో పాటు ముగ్గురు జీయర్లు నవ దంపతులను ఆశీర్వదించారు. 165 మండపాలలో 30 మంది పరివార్లు, వేద పండితులు వివాహ కార్యక్రమ తంతు నిర్వహించారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి వస్తున్నారని తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. చిన్న జీయర్ స్వామి ప్రవచనాలను విన్నారు. కళ్యాణ అనంతరం సుమారు 20వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు, చిన్న జీయర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.