★ జూన్ 9 న కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇంటలిజెన్స్ బ్యూరో (IB) Inspectors ఎగ్జామ్ కూడా
★గత నాలుగు నెలల నుండి ఎన్నికల నిర్వహణలో తలమునకలై ఉన్న పలు శాఖల ప్రభుత్వ ఉద్యోగులు
★ బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
జూన్ 9 న జరగబోయే గ్రూప్-1 ఎగ్జామ్ ను కనీసం ఒక నెల (మాత్రమే) అయినా వాయిదా వెయ్యాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా TSPSC ని కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్(X) లో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి
1. జూన్ 9న కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇంటలిజెన్సు బ్యూరో (IB) Inspectors పరీక్ష ఉంది. ఈ పరీక్షకు చాలా మంది తెలంగాణ నిరుద్యోగులు అప్లై చేశారు.
2. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు (రెవెన్యూ పోలీసులు ముఖ్యంగా) గత నాలుగు నెలల నుండి ఎన్నికల నిర్వహణలో తలమునకైనందు వల్ల వాళ్లకు బాగా ప్రిపేర్ అయ్యే అవకాశం లభించలేదు. వారికి ఒక నెల టైం ఇచ్చి లాస్ ఆఫ్ పే మీద చదువుకొని పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది.
3. గత ఎనిమిది సంవత్సరాలుగా గ్రూప్ వన్ పరీక్ష కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని , పరీక్షను పకడ్భందీగా నిర్వహించాలని ఆయన కోరారు.