– కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం
– వేడుకలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్
– సుమారు 2 వేల మందికి అన్నదానం
నేటి గదర్, 01 జూన్, భద్రాద్రి కొత్తగూడెం :
భద్రాచలం పట్టణంలోని ఐటిడిఏ రోడ్డు లో గల అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం శనివారం హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో భాగంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకల్లో మహబూబాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పాల్గొని శ్రీ దేవత మూర్తులకు వస్త్రాలను సమర్పించారు. రంగ రంగ వైభవంగా జరుగుతున్న సీతారాముల కళ్యాణం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా వీక్షించి తరించిపోయారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి 2 వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ వెంట తాండ్ర నరసింహారావు, భజన సతీష్, రాచమల్ల రాము, అన్నం రాంరెడ్డి, అన్నం వెంకటేశ్వర రెడ్డి, ఎడారి ప్రదీప్, మార్కెట్ వినోద్ ,
వసంతాల రాజేశ్వరి, కళ్యాణి, తిరుపతయ్య, దేవకి, తుమ్మల, రాణి తదితరులు పాల్గొన్నారు.