★ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ.
నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, ( జూన్ 01):
తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ అన్నారు. శనివారం అదనపు కలెక్టర్ పి శ్రీజ వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జవహర్ నగర్ గ్రామం లోని కస్తూర్బా గాంధీ పాఠశాల మరియు ఆదర్శ పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేసి, పనుల పురోగతిని, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యతలో రాజీ పడకూడదని, విద్యార్థులకు ఉపయోగపడే అత్యవసర పనులను త్రాగునీరు, మూత్రశాలల మరమ్మతులు, ఎలక్ట్రిఫికేషన్ లాంటి కనీస అవసరాలను అమ్మ ఆదర్శ పాఠశాల పనులలో ఎంపిక చేసి పూర్తి చేయడం జరుగుచున్నదని తెలిపారు. కేజీబీవీ వెంకటాపూర్ పాఠశాలలో విద్యార్థుల అవసరాల కోసం మౌలిక సదుపాయాలు కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా పనులు పూర్తి చేసుకోవాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పాఠశాల పున ప్రారంభం కంటే ముందే పూర్తి చేసుకోవాలని కేజీబీవీ ప్రత్యేక అధికారిని ఆదేశించారు. జరుగుతున్న పనులను ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తూ నాణ్యతతో కూడిన పనులను సకాలంలో పూర్తి చేయవలసిందిగా ఏ ఈ లను, మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని, సమగ్ర శిక్ష ప్లానింగ్ కోఆర్డినేటర్ అర్షం రాజు, ములుగు, వెంకటాపూర్ మండలాల తాత్కాలిక ఇన్చార్జి మండల విద్యాశాఖ అధికారి సూర్యనారాయణ, ఏఈ తదితరులు పాల్గొన్నారు…