నేటి గద్ధర్ న్యూస్,రాజన్న సిరిసిల్ల జిల్లా (జూన్, 05)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సైకిల్ ర్యాలీ నిర్వహించారు.సిరిసిల్ల పట్టణంలోని రగుడు చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు సాగిన సైకిల్ ర్యాలీలో పాల్గొని మొక్కలు జిల్లా ఎస్పీ ,పోలీస్ అధికారులు, సిబ్బంది, యువకులు మొక్కలను నాటినారు.ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ,ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోని చెట్లను పెంచడం ద్వారా భావితరాలకు కాలుష్యరాహిత సమాజాన్ని అందిగలమని అన్నారు. స్వచ్ఛమైన అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం గురించి మొక్కలు నాటాలని,నాటిన ప్రతి మొక్కను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు.ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని ,ఫలితంగా అక్కడ ఉండే వారి యొక్క ఆలోచన విధానం కూడా మారుతుందని అన్నారు. ప్రకృతి మనకు ఎంత ముఖ్యమైనదని, ప్రకృతి తరువాతనే జీవకోటి భూమి పైకి వచ్చిందన్న విషయం చరిత్ర చెప్పిన సత్యం అని అన్నారు. భూ మండలం పై పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రాణ వాయువు అయిన ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు, విపత్తుల సమయం లో చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని , భూమి మీద పశుపక్షాదుల నివాసం చెట్లే నని , మానవ జీవన విధానంలో చెట్ల పాత్ర ఎంతో ముడిపడి ఉందని అన్నారు. మొక్కలు మానవ జీవ కోటికి ప్రాణధారము అనీ భూ భాగములో జీవ కోటికి అత్యంత అవసరము అయిన వాటిలో మొక్కలు ప్రధానమైనవి అనీ ప్రతి ఒక్కరూ తమ వంతు భాద్యతగా నాటిన మొక్కలను ఖచ్చితంగా రక్షించాలని తెలియజేసారూ.సైక్లింగ్ , వ్యాయమం చేయడం వల్ల ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందవచ్చునని , ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక గంట సేపు సైక్లింగ్ , వ్యాయమం చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీ నాగేంద్రాచరి, సి.ఐ లు రఘుపతి, శ్రీనివాస్ గౌడ్,వీరప్రతాప్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆర్.ఐ లు యాదగిరి, రమేష్, ఎస్.ఐ లు , సిబ్బంది, పాల్గొన్నారు.