పర్యావరణ పరిరక్షణకై లయన్స్ క్లబ్ సభ్యులతో ప్రతీజ్ఞ…
నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 5:
మణుగూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం,
పర్యావరణ పరిరక్షణకై సభ్యులతో ప్రతీజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా
లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గాజుల పూర్ణ చందర్ రావు,సెక్రటరీ డాక్టర్ షేక్ మీరా హుస్సేన్ మాట్లాడుతూ,మానవాళికి చెట్లు ఎంతో ముఖ్యమని,ప్రతీ కుటుంబం నుండి కనీసం 3 మొక్కలు అయినా నాటాలని పేర్కొన్నారు. అడవుల సంఖ్య తగ్గడం వలన భూతాపం పెరుగుతున్నదని,దీని వలన భూమి మీద మానవ మనవడకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉన్నదని తెలిపారు.సముద్రాలలోని మంచు ఖండాలు కరిగి,పెను విపత్తులు సంభవించే ప్రమాదం ఉందన్నారు,సామాజిక బాధ్యతతో ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటి, సంరక్షించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.ప్రపంచ పౌరుడిగా ఇది ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యం అని అన్నారు.ఈ భూమి మీద భావితరాల సంక్షేమం కోసం మనం మొక్కలను నాటి ప్రకృతిని రక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో ప్రెసిడెంట్ గాజుల పూర్ణ చందర్ రావు, సెక్రటరీ డాక్టర్ షేక్ మీరా హుస్సేన్,ఎలక్ట్ ప్రెసిడెంట్ సత్య ప్రకాష్,అడబాల నాగేశ్వరరావు, ముత్తంశెట్టి నాగేశ్వరావు, కముజు చంద్రమోహన్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.