★ మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది
నేటి గద్ధర్ న్యూస్,వెబ్ డెస్క్:
నల్లగొండ ఎమ్మెల్సీ ఫలితం కొన్ని గంటల లో వెలువలనుంది. అశోక్ సార్ ఓట్లని ముగ్గురు అభ్యర్థులకు బదిలీ చేస్తుండగా… బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఓట్లను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి లకు పంచనున్నారు. తదనంతరం అత్యధిక ఓట్లు సాధించిన వారిని ఎమ్మెల్సీగా ప్రకటిస్తారు. ప్రజెంట్ వస్తున్న ట్రెండ్స్ ప్రకారం 90% విజయవకాశాలు తీన్మార్ మల్లన్నకు ఉండగా 10% రాకేష్ రెడ్డికి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనాప్పటికీ తీన్మార్ మల్లన్న గెలుపు నల్లేరు మీద నడికే అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. కాగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి టఫ్ ఫైట్ ను ఇచ్చారు.
Post Views: 804