నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, (జూన్ 07):
– గత ఏడాది వరదల కారణంగా ముంపుకు గురైన గ్రామాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలి
– రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు అనేక గ్రామాలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఈ ఏడాది ఎలాంటి ప్రాణనష్టం ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఉన్న చెరువులు కుంటలు పరిశీలించి
ఏమైనా మరమత్తులు ఉంటే నా దృష్టికి తీసుకువస్తే డీఎంఎఫ్ట్ నిధులు మంజూరు చేస్తానని అధికారులకు సూచించారు
కరకట్ట నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలి గోదావరి జంపన్న వాగు ఉదృతి మూలాన గత ఏడాది అనేక గ్రామాల్లో నీరు చేరి ముంపుకు గురైన పరిస్థితి నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముంపుకు గల కారణాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి అని అధికారులకు సూచించారు మారేడు గుండ చెరువు కట్ట నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలి రైతులకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అందరూ పని చేయాలని అధికారులకు సూచన చేశారు…