BC బాలుర వసతిగృహం వార్డెన్ గుమ్మడి వెంకటేశ్వర్లు
నేటి గద్ధర్ న్యూస్,పినపాక:2024-2025 విద్యా సంవత్సరానికి గా పినపాక మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతిగృహం నందు చేరుటకు అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల బిసి బాలుర వసతి గృహం వార్డెన్ గుమ్మడి వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వసతి గృహం నుండి కనీసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులు వసతి గృహంలో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని , ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బాలురు మూడవ తరగతి నుండి పదవ తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. వసతి గృహంలో ప్రవేశం కొరకు నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, విద్యార్థి ఆధార్ కార్డు తో పినపాక వసతిగృహంలో సంప్రదించాలని తెలిపారు.
Post Views: 122