నేటి గద్ధర్ న్యూస్,ములుగు ప్రతినిధి:
మందు పాతరలు పేలి అటవీ జంతువులు మృతి చెందిన సంఘటన
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని అటవీప్రాంతంలో చోటు చేసుకుంది. ములుగు SP తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. పోలీసులే టార్గెట్ గా మావోయిస్టులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం మందు పాతరలను అమర్చడం ద్వారా ఆటవి జంతువులు సైతం మృత్యువాత పడుతున్నాయని సోమవారం ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ అన్నారు. నూగూరు వెంకటాపురం మండలం సమీపంలోని అటవీ ప్రాంతంలో 3 ఐఈడి మందు పాతరలు పేలి ముళ్ళ పంది, కొండెంగ, మరో జంతువు మృత్యువాత పడిందని ఎస్పీ తెలిపారు. వాటి కళేబరాలను గుర్తించడం జరిగిందన్నారు
Post Views: 360