నేటి గదర్ న్యూస్ ,ఖమ్మం ప్రతినిధి :
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పండిట్, పీఈటీ పోస్టులను అప్ గ్రేడ్ చేస్తూ సంబంధిత ఉపాధ్యాయుల జాబితా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల పరిశీలనకు అందరూ ఆదివారం హాజరు కావాలని సూచించింది. దీంతో ఖమ్మం ఇందిరానగర్ హైస్కూల్ వద్ద హిందీ, ఉర్దూ సబ్జెక్టుల ఉపాధ్యాయులకు, రోటరీ నగర్ హైస్కూల్ లో తెలుగు పండిట్లకు, నయాబజార్ హైస్కూల్లో పీఈటీల సర్టిఫికెట్లు పరిశీలించారు. మొత్తం 552 మందికి గాను 530 మంది హాజరయ్యారు.
Post Views: 35