+91 95819 05907

వైరాలో 100 పడకాల హాస్పిటల్ కి గ్రీన్ సిగ్నల్

నేటి గదర్ న్యూస్ , వైరా ప్రతినిధి :

వైరా పట్టణం లో కేవీసీఎం డిగ్రీ కాలేజీ మరియు ఎన్నారై పాలిటెక్నిక్ కళాశాల భవనాల్లో తాత్కాలికంగా వంద పడకల ఆసుపత్రిఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

ఆ విషయాన్ని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సోమవారం వైరాలో మూతపడి ఉన్న కేవీసీఎం డిగ్రీ, ఎన్నారై పాలిటెక్నిక్ కళాశాల భవనాలను, పరిసరాలను సందర్శించి పరిశీలించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన వైరాలో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది.

వంద పడకల ఆసుపత్రికి శాశ్వత భవనాలు నిర్మించే వరకు వేచి చూడకుండా వెంటనే ప్రైవేట్ భవనాల్లో నైనా ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలందించేందుకు ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు సూచించారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే రంగంలోకి దిగారు. ఈ వంద పడకల ఆసుపత్రికి శాశ్వత భవనాలు ఏర్పాటు చేసేందుకు సేకరించిన రెవెన్యూ కార్యాలయం వెనుక భాగంలోని స్థలాన్ని ముందుగా పరిశీలించారు. ఈ స్థలంలో ఆసుపత్రి భవనాలు నిర్మించేందుకు కనీసం ఏడాది సమయమైనా పడుతుందని అప్పటివరకు వేచి చూడకుండా ఈ ఆసుపత్రిని ప్రైవేట్ భవనాల్లో ఏర్పాటు చేయాలని చర్చ జరిగింది.

ప్రైవేట్ భవనాలకు బదులు గత పదేళ్ల నుంచి నిరుపయోగంగా ఉంటున్న కేవీసీఎం విద్యాసంస్థల భవనాల్లో తాత్కాలికంగా వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తే విశాలమైన ఆవరణం, పక్కాగా ఉన్న భవనాల్లో ఎలాంటి అద్దెలు లేకుండా ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకుండా ఉంటుందని, రోగులకు సౌకర్యవంతంగా ఉపయోగపడుతుందని భావించి ఈ విద్యాసంస్థలను పరిశీలించిన ఎమ్మెల్యే తదితరులు ఇక్కడే తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత ఏడాది జూలైలో వైరా కు వంద పడకల ఆసుపత్రి మంజూరైంది. డాక్టర్లు సహా సిబ్బంది మొత్తం 98 పోస్టులు మంజూరయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టాఫ్ నర్సులను కూడా కేటాయించింది.

ఇప్పటికే ఈ కేవీసీఎం విద్యాసంస్థలను విద్యావసరాల నిమిత్తం ప్రభుత్వానికి స్వాధీనం చేయటానికి యాజమాన్యం నిర్ణయించి ప్రతిపాదించింది. వెంటనే వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి శాశ్వత భవనాల నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఆసుపత్రిని అక్కడకు తరలించే విధంగా చర్చలు జరిపి నిర్ణయించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సిహెచ్. వేణు, వైరా పిహెచ్సి డాక్టర్ తాతా ఉదయలక్ష్మి, వైరా, కొణిజర్ల మండల కాం గ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, వడ్డే నారాయణ, నాయకులు దాసరి దానియేలు, ఏదునూరి సీతరాములు, పమ్మి అశోక్, వల్లపు కొండలు, సూర్యదేవర శ్రీధర్, మల్లు రామకృష్ణ, మూడుముంతల గంగరాజు , పాలేటి నరసింహారావు, పఠాన్ జాన్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !