ముళ్ల పొదల్లో భారీగా గంజాయి సంచులు
★స్వాధీనం చేసుకున్న పోలీసులు
నేటి గద్ధర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి:
రాష్ట్రంలో గంజాయి కట్టడికి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అక్రమార్కులు ఏదో ఒక విధంగా గంజాయి అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు.
సోమవారం *ఖమ్మం* పట్టణంలోని కొత్త బస్టాండ్ వెనుక ఉన్న ముళ్ల పొదల్లో గంజాయి లభించండం స్థానికంగా కలకలం రేపింది.
కొత్త బస్టాండ్ వెనుక భాగంలో ఉన్న ముళ్ల పొదల్లో గంజాయి దాచిపెట్టారనే సమాచారం మేరకు ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సుంకరి రమేష్ సిబ్బందితో కలిసి ముళ్ల పోదల్లో ఉన్న సంచులను బయటకు తీశారు. మూడు సంచుల్లో ఉన్న గంజాయిని తూకం వేయగా 39.5 కిలోలుగా ఉందని సీఐ రమేష్ తెలిపారు. ఈ గంజాయి విలువ రూ. 20 లక్షల మేరకు ఉంటుందని పేర్కొన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఎవరైనా గంజాయి అమ్మినా రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.