★పినపాక SC బాలుర వసతి గృహం వార్డెన్ సురేష్
నేటి గద్ధర్ న్యూస్,పినపాక:
ప్రభుత్వ షెడ్యూల్ కులం అభివృద్ధి శాఖ(SC D D) పినపాక వసతి గృహంలో చేరుటకు 2024-2025 విద్యా సంవత్సరానికి అర్హులైన పట్టణ, గ్రామీణ నిరుపేద విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఆ వసతి గృహం వార్డెన్ సురేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు విడతలలో అడ్మిషన్లు స్వీకరించనున్నట్లు ..వసతి గృహం నుండి కనీసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులు వసతి గృహంలో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని , ఎస్సీ బాలురు మూడవ తరగతి నుండి 9 వ తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ,మొదటి విడత జూన్ 12 నుండి జూన్ 30 వరకు,రెండవ విడత జులై 5 నుంచి జులై 25 వరకు దరఖాస్తులు స్వీకరించబడు నని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థుల తల్లిదండ్రులు పి నపాక వసతి గృహంలో పైన పేర్కొన్న తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించాలని కోరారు.
★SC వసతి గృహంలో చేరుటకు 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, విద్యార్థి ఆధార్ కార్డు తో పినపాక వసతిగృహంలో సంప్రదించాలని తెలిపారు.పూర్తి వివరాలకు 9676282275,8897889066 అనే నెంబర్లలో సంప్రదించాలని కోరారు.