నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి అమరావతి జూన్ 11:
నైనారపు నాగేశ్వరరావు✍️
చంద్రబాబును చూడాలంటూ ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. సెక్యూరిటీ అడ్డుకున్నా బాబుపై అభిమానంతో కాన్వాయ్ వెంట పరుగులు తీసింది.కాన్వాయ్ వెంట పరుగులు తీస్తున్న మహిళను చూసిన చంద్రబాబు నాయుడు సెక్యూరిటీని వారించి ఆమెను పిలిచి వివరాలు తెలుసుకున్నారు.తనది మదనపల్లి అని తన పేరు నందిని అని పరిచయం చేసుకుంది.మీపై అభిమానంతో జ్వరం ఉన్నా వచ్చానని మీరు సీఎం కావాలనేదే తన కోరిక అని చెప్పారు. ముందు ఆస్పత్రికి వెళ్లాలంటూ నందినికి చంద్రబాబు సూచించి ఆమెకు అవసరమైన వైద్యసాయం అందించాలంటూ పార్టీ కార్యకర్తలకు సూచించారు.ఈరోజు విజయవాడలో కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం ఉండవల్లికి చంద్రబాబు ప్రయాణం అవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Post Views: 401