+91 95819 05907

భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య..?

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి యాదాద్రి జూన్ 11:
నైనారపు నాగేశ్వరావు ✍️

యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగికి చెందిన చీరిక హనుమంతరెడ్డి హైదరాబాద్‌లో ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే అద్దె ఇంట్లో ఉండేవాడు. హనుమంతరెడ్డి తండ్రి నర్సిరెడ్డి పేరిట 7.24 కుంటల భూమి ఉంది.పోస్ట్‌ మాస్టర్‌గా ఉద్యోగ విరమణ చేసిన నర్సిరెడ్డి మూడేళ్ల క్రితం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు.తండ్రి ఆస్తిలో తమకూ వాటా కావాలని హనుమంతరెడ్డి తోబుట్టువులు కోర్టును ఆశ్రయించారు.అంతే కాకుండా తమ్ముడు కరుణాకర్‌రెడ్డి తోనూ హనుమంతరెడ్డికి ఆస్తి తగాదాలున్నాయి.ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా మానసిక వేదనతో ఉన్న హనుమంతరెడ్డి శనివారం రాత్రి పంతంగిలోని ఇంటికి వచ్చి ఉరి వేసుకున్నాడు.ఘటనపై పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అయితే తన భర్త మృతికి ఆడపడుచులు,మరిదే కారణమని హనుమంతరెడ్డి భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో వారి ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.దీంతో భయపడ్డ ఇద్దరు చెల్లెళ్లు,తమ్ముడు ఆ కేసును ఉపసంహరించుకోవాలని గ్రామ పెద్దల ద్వారా హనుమంతరెడ్డి భార్యపై ఒత్తిడి తెచ్చారు.అయితే ఆస్తి విషయమై కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుంటేనే తన భర్త అంత్యక్రియలు నిర్వహిస్తామని హనుమంతరెడ్డి భార్య ఆమె బంధువులు తేల్చిచెప్పారు.వారు కేసు ఉపసంహరించుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !