నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి :
గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలను చెల్లించాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.
గత కొద్ది నెలలుగా గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు అందాక అనేక సమస్యలు పడుతున్నారు.వారి జీతాలను వెంటనే చెల్లించాలని కోరుతూ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ ఆఫీస్లో వి.పి గౌతమ్ కు కార్మికులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల మల్లయ్య మాట్లాడుతూ.. కార్మికులకు జీతాలు లేక కుటుంబ పోషణ భారం అవుతుందని తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించాలని అన్నారు.
Post Views: 28