◆వెంటనే బస్సుల సంఖ్య పెంచాలి
◆ప్రగతిశీల మహిళా సంఘం POW
◆TGRTC ప్రయాణికులకు సరిపడా బస్సులు పెంచాలని కొత్తగూడెం మేనేజర్ కు వినతి పత్రం అందజేసిన-POW
నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
కొత్తగూడెం: ప్రగతిశీల మహిళా సంఘం, రాష్ట్ర కమిటీ పీలుపులో భాగంగాఈరోజు కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేసిన CPIML మాస్ లైన్ అనుబంధ సంఘం ప్రగతిశీల మహిళా సంఘం (POW) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఎదలపల్లి సావిత్రి కేచ్చల కల్పన
అనంతరం వారు మాట్లాడుతూ కొత్తగూడెం, మణుగూరు ఇల్లందు, డిపోల నుండి
పెరుగుతున్న ప్రయాణికుల రీత్యా బసలు పెంచాలని వారు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, ప్రభుత్వం6 గ్యారంటీలతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు.
అన్ని డిపోలలో ప్రయాణికుల రద్దీ పెరిగిన రీత్యా బస్సుల సంఖ్య తగ్గింది కానీ పెరగలేదు అన్నారు.
కొత్తగా ఇల్లందు డిపోలో
బస్సులు లేవని కేవలం నామమాత్రానికే డిపో పరిమితమైందన్నారు
ఉన్న నాలుగు బస్సులు ఎక్కడ ఆగిపోతాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు.
◆అశ్వరావుపేట మండలంలోని, అనంతారం, కావడి గుండ్లకు బస్సులు రావడం లేదు వెంటనే బస్సులు కేటాయించాలి
◆ ఇల్లందు మండలంలోని రొంపేడు, మిట్టపల్లి, ధర్మారం, ముత్తారపు కట్ట ఒంపు గూడెం మసివాగు కలుపుకొని అటునుండి కొమరారం బస్సులు నడపాలి,
సుదిమల్ల, హనుమంతులపాడు ధర్మారం,
టేకులపల్లి మండలంలో
మార్ముల ఏజెన్సీ ఆన్ని ప్రాంతాలకు బస్సుల సంఖ్య పెంచి ఈరూట్లో బస్సులు నడపాలని కోరారు, ఖమ్మం కూడా పరిస్థితి అలాగనే ఉందని బస్సుల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ వినతి పత్రం కార్యక్రమంలో కొమరారం మాజీ సర్పంచ్ ముత్తక్క, ఇల్లందు మాజీ కౌన్సిలర్ రేసు సరిత ఇల్లందు పట్టణ నాయకురాలు బండి వెంకటమ్మ గద్దల కుమారి సరోజినీ భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు