◆ఎర్రుపాలెం మండలం జమలాపురం యూనియన్ బ్యాంకు లో జరిగిన సంఘటన.
◆వెంకటాపురం వివో భర్త కన్నయ్య సిసి సంతకం పోజురీ చేసి మోసం చేసిన వైనం.
◆బ్యాంకు ఎదుట ఆందోళన చేసిన మహిళలు..
◆రెండు దఫాలుగా డబ్బులు చెల్లిస్తానని బ్యాంకు మేనేజర్ శ్రీనాథ్ సమక్షంలో ఒప్పుకున్న కన్నయ్య.
◆ఆందోళన విరమించుకున్న మహిళా సంఘాలు
నేటి గద్దర్ న్యూస్,మధిర ప్రతినిధి:
ఎర్రుపాలెం మండలం పరిధిలోని జమలాపురం యూనియన్ బ్యాంక్ లో డ్వాక్రా మహిళలకు ఓ వ్యక్తి కుచ్చు టోపీ పెట్టాడు. రూ28,30, 000లక్షలు సిసి సంతకాన్ని ఫోర్జరీ చేసి వెంకటాపురం గ్రామంలో ఉన్న 30 గ్రూపులకు చెందిన 300 మంది సభ్యుల నగదును డ్రా చేసుకొని తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడు. విషయాన్ని లేటుగా తెలుసుకున్న డ్వాక్రా సభ్యులు కుంపటి కన్నయ్య ను అడగగా డబ్బులు సన్నిహితుల ఎకౌంటు కు ట్రాన్స్ఫర్ చేయించి డ్రా చేశానని తెలిపాడు. దీంతో ఆగ్రహించిన సభ్యులు బ్యాంకు వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో కొంపటి కన్నయ్యను బ్యాంకు మేనేజర్ శిస్ట్ల శ్రీనాథ్ అడగగా డబ్బులు వాడుకున్నానని తెలిపాడు దీంతో ప్రైవేట్ సెటిల్మెంట్ చేసి నగదును రికవరీ చేస్తానని కన్నయ్య తెలిపాడు కన్నయ్య.భార్య శిరీష వెంకటాపురం గ్రామంలో వివో గా పని చేస్తున్నట్లు సమాచారం.
*మేనేజర్ వివరణ* కన్నయ్య అనే వ్యక్తి గతం నుంచి డ్వాక్రా సభ్యులకు సంబంధించిన లావాదేవీలను తానే కొనసాగిస్తారని అదే నమ్మకంతో డ్వాక్రా గ్రూపులకు తీర్మానం ద్వారానే లోన్ అందించినట్లు, నిందితులు తన స్వప్రయోజనానికి ఆ నగదును వాడుకున్నట్లు ఆయన తెలిపారు.