నేటి గదర్,జూన్ 12 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):
ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా మున్నేరు వాగుపై నూతనం నిర్మాణం చేపట్టిన రిటర్నింగ్ వాల్ నిర్మాణపు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఉన్న అధికారులకు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. నిర్మాణపు పనుల్లో ప్రతిభావంతులైన వర్కర్లను మాత్రమే నియమించాలని, పనుల్లో లోపాలు తలెత్తకుండా చూడాలనీ సూచించారు.. ఇప్పటికే నాలుగు నెలల సమయం వృధా అయింది… పూర్తి స్థాయిలో నిర్మాణ పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయాలని మరో పదిరోజుల్లో మళ్ళీ వస్తాను పనుల్లో పురోభివృద్ధి లేకపోతే బాధ్యుల పై చర్యలు తప్పవని,అలాగే పనుల్లో నాణ్యత లోపించిన ఊరుకునేది లేదనీ హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు మున్నేరు కు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఇరిగేషన్ అధికారులకు అప్పగించండి. గోళ్ళపాడు సైడ్ డ్రెన్ల మాదిరిగా మున్నేరు సైడ్ డ్రైన్ లను నిర్మించాలని సూచించారు.
స్టార్టింగ్ పాయింట్… ఎండింగ్ పాయింట్ లను గుర్తించి సైడ్ డ్రైన్ ల నిర్మాణ పనులను చేపట్టాలి… తద్వారా మురికి నీరు మున్నేరు లో చేరకుండా ఉంటుందినీ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,అధికారులు పాల్గొన్నారు.









