★బక్రీద్ కోసం హైదరాబాదుకు పశువులను తరలిస్తున్నారా..?
★చాకచక్యంగా పశువులను తరలిస్తున్న పెద్ద కంటైనర్ ను పట్టుకున్న ఎస్సై మేడ ప్రసాద్.
నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 12:
నైనారపు నాగేశ్వరరావు ✍️
మణుగూరు నుండి హైదరాబాద్ కు అక్రమంగా భారీగా తరలిస్తున్న గోవులను పట్టుకున్న మణుగూరు ఎస్సై మేడ ప్రసాద్. మణుగూరు సిఐ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మణుగూరు పట్టణ పరిధిలోని మణుగూరు శివారులో ఇసుక బంకర్ దగ్గర రైల్వే ట్రాక్ పై నిన్న రాత్రి గోవులను అదుపులోకి తీసుకున్న మణుగూరు పోలీసులు దాదాపు 70 నుంచి 100 గోవులు స్వాధీనం చేసుకున్నారు.అక్రమార్కుల గుండెల్లో సింహస్వప్నం లాగ మణుగూరు ఎస్ఐ మేడ ప్రసాద్ చాకచక్యంగా వ్యవహరించి బలైపోతున్న వందలాది పశువులను కాపాడారని పలువురు ప్రశంసిస్తున్నారు.మణుగూరు సిఐ ఎస్ సతీష్ కుమార్ ఆదేశానుసారం మణుగూరు నుండి అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తున్న దాదాపు 100 గోవులను రక్షించి అక్రమార్కులను అదుపులోకి తీసుకున్న మణుగూరు ఎస్సై మేడా ప్రసాద్ తెలిపారు.









