★పలు ప్రజా సమస్యల పరిష్కారానికై విజ్ఞప్తి
★BRS మండల ప్రధాన కార్యదర్శి,మొండికుంట మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి
నేటి గద్ధర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి(మణుగూరు):అశ్వాపురం మండలం మొండికుంట గ్రామపంచాయతీలోని బిజీ కొత్తూరు పంప్ హౌస్ పరిశీలనకు విచ్చేయుచున్న రాష్ట్ర మంత్రివర్గానికి BRS మండల ప్రధాన కార్యదర్శి,మొండికుంట మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి మండలంలోని పలు సమస్యలను విన్నవించారు. గత రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి సీతారామ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో 400 కోట్ల రూపాయల పైచిలుకు నిర్మాణ వ్యయంతో నిర్మించ తలపెట్టి తక్షణమే రూ.21 కోట్లు మంజూరు చేసి బిజీ కొత్తూరు పంప్ హౌస్ నుండి మారేళ్ళపాడు రిజర్వాయర్ ద్వారా తుమ్మలచెరువుకు నీటిని మళ్లించి ఆయకట్టు రైతులకు రెండు పంటలు పండించే విధంగా ప్రారంభించిన పనులు నిలిచి పోయాయన్నారు.తక్షణమే నూతన ప్రభుత్వం త్వరిత గతిన పూర్తి చేయాలని, తుమ్మలచెరువు ఆయకట్టు రైతుల చిరకాల కోరిక నెరవేర్చాలని కోరారు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి అశ్వాపురం మండల కేంద్రానికి వెళ్లాలంటే మొండికుంట, మల్లెలమడుగు,రామచంద్రాపురం, నెల్లీపాక, ఆనందపురం, సీతారాంపురం, తుమ్మలచెరువు, వెంకటాపురం, మామిళ్ళవాయి మరికొన్ని గ్రామాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా మొండికుంట గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. మండలంలో ప్రస్తుతం ఉన్నటువంటి అతి పెద్ద రెవిన్యూగా ఉన్నటువంటి నెల్లిపాక రెవిన్యూను విభజించి మొండి కుంట ను నూతన రెవెన్యూ గ్రామం గా ఏర్పాటు చేయాలని కోరుతూ, అలాగే తుమ్మలచెరువు గ్రామంలో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ఎనిమిది గ్రామాల ప్రజల కోరిక మేరకు శంకుస్థాపన చేసినటువంటి లోతు వాగు బ్రిడ్జ్ కు నిధులు మంజూరు చేసి టెండర్లు పూర్తయి శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టకుండా ఆగిన కారణంగా అట్టి దానినిత్వరగా పూర్తి చేయాలని , అలాగే గొంది గూడెం గ్రామానికి వెళ్లే రహదారిపై అర్ధాంతరంగా నిలిచినటువంటి ఇసుక వాగు బ్రిడ్జిని కూడా త్వరితగతిన నిర్మించి గిరిజన గ్రామాల ప్రజల ఇబ్బందులు తీర్చాలని కోరుతూ, పెండింగ్లో ఉన్నటువంటి వెంకటాపురం నుండి మామిళ్ళ వాయి బీటీ రోడ్డును కూడా తొందరగా ఏర్పాటు చేయాలని కోరుతూ, బిజీ కొత్తూరు గ్రామం వద్ద స్థల పరిశీలన జరిగి నవోదయ స్కూల్ కొరకు స్థలం కేటాయించిన కారణంగా నవోదయ స్కూల్ వరకు వెళ్లే రహదారిని కూడా మంజూరు చేసి శంకుస్థాపన చేసుకున్న నేపథ్యంలో పెండింగ్ పనులన్నీ సజావుగా జరిగేలా చూడాలని కోరారు.