నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి ( కౌశిక్), జూన్ 12:
పాఠశాలల విద్యార్థులకు ఏక రూప దుస్తుల పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు.బుదవారం జిల్లా కలెక్టర్ బండారుపల్లి మోడల్ పాఠశాలలో నూతన 2024-2025 విద్య సంవత్సరం ప్రారంభం లో భాగంగా విద్యార్దులకు ఏక రూప దుస్తుల పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బండారుపల్లి మోడల్ పాఠశాలలో 2024-25 నూతన విద్యా సంవత్సరం నకు సంబంధించి గురువారం విద్యార్దులకు ఏక రూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హాజరై పాఠశాల విద్యార్దులకు ఏక రూప దుస్తులులను, పాఠ్య పుస్తకాలను, పంపిణీ చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని, జిల్లా సైన్స్ అధికారి జయదేవ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శోభ రాణి , పాఠశాల ఉపాధ్యాయలు పాల్గొన్నారు.