నేటి గదర్,జూన్ 22 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):
ఐఐటీ బాంబే, ఎన్ఐటీ మిజోరంలలో సీట్లు సాధించిన పూర్వ విద్యార్థులను శనివారం కూసుమంచి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాయల వీరస్వామి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కూసుమంచి ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన విద్యార్థులు బానోత్ నవ్యకు ఐఐటీ బాంబేలో , వై ఉమేష్ చంద్ర ఎన్ఐటీ మిజోరంలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి కేశవపట్నం రవికుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీలలో సీట్లు సాధించడం గర్వకారణమన్నారు. కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల కృషిని అభినందిచారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలన్నారు. వాటిని సాధించడం కోసం నిరంతరం శ్రమించాలన్నారు. ఇప్పటి నుంచి అనుకున్న లక్ష్యం కోసం ముందుకు సాగితే అది సాధించడం కష్టం ఏమీ కాదన్నారు. ఇప్పటి నుంచి అనుకున్న లక్ష్యం కోసం ముందుకు సాగితే అది సాధించడం కష్టం ఏమీ కాదన్నారు. విద్యార్థులు ఎంతటి కష్టం ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటూ లక్ష్యం వైపు ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.