+91 95819 05907

ఆ మున్సిపాలిటీ లో ఎక్కడ చెత్త అక్కడే?

★మణుగూరు మున్సిపాలిటీ మురుగుతో వెదజల్లుతుంది …

★మున్సిపాలిటీ అధికారుల జాడెక్కడ..?

నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 22:
నైనారపు నాగేశ్వరరావు ✍️

మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో 2011 లెక్కల ప్రకారం 32వేల 65 మంది నివసిస్తున్నారు.2024 సంవత్సరం వరకు చూస్తే ఆ జనాభా 45 వేల పైచీలుకు ఉన్నట్లుగా తెలుస్తుంది.ఈ మున్సిపాలిటీలో 22 వార్డులుగా విభజించబడి ఉంది. మణుగూరు పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త కొండాపురం,బెస్తగూడెం అన్నారం,కమలాపురం,చిన్నరాయిగూడెం గ్రామాలు కూడా మున్సిపాలిటీలోనే కొనసాగుతున్నాయి.ఈ గ్రామాల్లో అత్యధికంగా ఆదివాసీలే జీవిస్తున్నారు.ఈ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగక సుమారు 18 సంవత్సరాలు కావస్తున్నాయి.ఈ మున్సిపాలిటీ లో పరిపాలనాపరంగా ప్రజాప్రతినిధులు లేక అభివృద్ధి కుంటుబడి ఉంది.ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో అధికారులదే ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటుంది.అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది.ఈ మున్సిపాలిటీకి సంవత్సరానికి కోట్ల రూపాయలు వస్తున్నప్పటికీ అభివృద్ధి మాత్రం శూన్యం.పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగక గ్రామాల్లో పట్టణంలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే దాపరించి ఉంది. పేరుకే మున్సిపాలిటీ అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉంటుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.మున్సిపాలిటీ అధికారులు ఉన్నారా లేరా అనే అనుమానాలతో ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ కాలువల్లో చెత్తాచెదారం నిండిపోయి దుర్వాసనలు వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.తూ తూ మంత్రంగా డ్రైనేజీ కాలువలోని చెత్తను తీసి రోడ్డుపైన వేసి ఆ చెత్తను తీసుకెళ్లకపోవడంతో అదే డ్రైనేజీలో పడిపోతుందని ప్రజలు మండిపడుతున్నారు.వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో డ్రైనేజీలోని చెత్తాచెదారాన్ని శుభ్రం చేయకపోతే భారీగా వర్షాలు వస్తే పైలెట్ కాలనీ,లెనిన్ నగర్ సుందరయ్య నగర్,బాలాజీ నగర్ ఆదర్శనగర్,బండారుగూడెం ప్రధాన రహదారి మొత్తం ముంపుకు గురైయ్యే పరిస్థితులు ఉంటాయని ప్రజలు, వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోతే వర్షపు నీరు ఎక్కడపడితే అక్కడే నిల్వ ఉండడంతో మురుగు నీటిలో దోమలు వృద్ధి చెందడంతో అట్టి దోమలు ప్రజలను కుట్టడంతో ప్రజలు విష జ్వరాల బారిన పడే ప్రమాదం ఉంటుందని పలువురు ఆరోపిస్తూన్నారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు తక్షణమే చేపట్టి ప్రజల్ని కాపాడాలని సంబంధిత అధికారులను కోరారు.పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేయకపోతే,మణుగూరు మున్సిపాలిటీ ప్రాంతం ముంపుకు గురైతే మున్సిపాలిటీ అధికారులే పూర్తి బాధ్యత వహించాలని ప్రజలు,వ్యాపారస్తులు,పుర ప్రముఖులు హెచ్చరిస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బి ఎస్ పి పార్టీ ఏన్కూర్ మండల అధ్యక్షులుగా దుంపల రవి నియామకం.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. ఏన్కూర్ :ఈరోజు ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఏనుకూరు మండల అధ్యక్షులుగా దుంపల రవిని నియమిస్తున్నట్టు ఖమ్మం జిల్లా అధ్యక్షులు

Read More »

పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం…జీవితాంతం ఇంకా రాజకీయాల జోలికి పోను !!!

పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాలు మాట్లాడను.. తన జీవితాంతం ఇంకా రాజకీయాల జోలికి పోను అని ప్రకటించారు. ఇన్నేళ్ల జీవితం నేను ఎవరికి తలవంచలేదు.. ఆడవాళ్ళనే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు,

Read More »

లగచర్ల రైతులపై నిర్బంధాన్ని వెంటనే ఆపాలి.

◆ రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. తెలంగాణ గిరిజన సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం,

Read More »

ప్రజల భవిష్యత్ కోసం ఉద్యమించాలి….

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ పోరాటం ప్రణాళిక రూపొందిద్దాం. తొమ్మిదవ మండల మహాసభను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.బ్రహ్మచారి. రానున్న మూడు సంవత్సరాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిర్వహించే ప్రజా

Read More »

కబ్జా కు గురవుతున్న రోడ్డు మార్గాలు.!

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ మారుమూల గ్రామలలో సైతం కబ్జా రాయుల్లు.! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ లోని ఉన్న రెవిన్యూ భూమిని సైతం కబ్జా కోరల్లోకి వెళ్తుంది. తిప్పాపురం

Read More »

ఆదరిస్తే శాసన మండలిలో గళం విప్పుతా – భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు

ఆదరిస్తే శాసన మండలిలో గళం విప్పుతా – భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు కరీంనగర్ జిల్లా : నవంబర్ 21,(హుస్నాబాద్ భార్గవాపురం

Read More »

 Don't Miss this News !