★మల్టీ జోన్ 1 పరిధిలో ఇద్దరు ఇన్స్ స్పెక్టర్ల పై సస్పెండ్ వేటు…
★మరో ముగ్గురు ఇన్స్ స్పెక్టర్లను మల్టీ జోన్ 1 ఐజీ కార్యాలయానికి అటాచ్…
★మల్టీ జోన్ 1 ఐజి ఎవి రంగనాథ్.
నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి జూన్ 22:
నైనారపు నాగేశ్వరరావు ✍️
మల్టీ జోన్ 1 పరిధిలోని అవినీతికి పాల్పడి నందుకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సత్తుపల్లి గ్రామీణ ప్రాంతంలో పేకాటరాయళ్ళకు సహకరిస్తూ, ప్రోత్సాహిస్తూ అవినీతికి పాల్పడుతున్న సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఎన్ వెంకటేశంతో పాటు అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు కేసులు నమోదు చేసినందుకు గాను ఇదే కమిషనరేట్ లో గతంలో పని చేసి ప్రస్తుతం ములుగు జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న సిహెచ్ శ్రీధర్ గౌడ్ ఇన్స్ స్పెక్టర్ ను సస్పెండ్ చేయడంతో పాటు,మతకల్లోల సమయంలో విధులను నిర్లక్ష్యంగా వ్యవహారించినందుకు మెదక్ పట్టణ,రూరల్ ఇన్స్ స్పెక్టర్లు ఎస్ దిలీప్ కుమార్,బి కేశవులను అలాగే అధికార పర్యవేక్షణ లోపించినందుకు గాను భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ బి రాజేశ్వర్ రావును మల్టీ జోన్ 1 ఐజీ కార్యాలయంకు అటాచ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఎవి రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే…
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సత్తుపల్లి గ్రామీణ ప్రాంతంలో పేకాట కేంద్రాలు నిర్వహిస్తునట్లుగా పోలీస్ ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు రావడంతో అధికారులు ఆదేశాల మేరకు పేకాట కేంద్రాలపై పోలీసులు నిర్వహించిన దాడుల్లో పట్టుబడిన పేకాటారాయుళ్లను అరెస్ట్ చేసి విచారించగా సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఎన్ వెంకటేశం ముందుస్తుగానే పోలీసుల దాడులకు సంబంధించి పేకాట కేంద్రాల్లోని పేకాటారాయుళ్లకు సమాచారం ఇవ్వడంతో పేకాట కేంద్రాలను పొత్సహించేవాడని ఇందుకు సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఎన్ వెంకటేశంకు ఆర్ధికంగా లాభం చేకూర్చడం జరుగుతుందని అధికారుల విచారణలో నిర్ధారణ కావడంతో సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఎన్ వెంకటేశంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.మరో ఘటనలో ఇదే కమిషనరేట్ పరిధిలో ఖమ్మం పట్టణంలో 2022-23 మధ్య కాలంలో ఖమ్మం 2 టౌన్ ఇన్స్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ శ్రీధర్ గౌడ్ స్థానిక విలేకరి ఇంటిలో ఎస్ఎల్ఆర్ తుపాకీ సంబంధించిన ఆరు తుటాలు లభ్యమైనట్లు ఆయుధాల చట్టంతో పాటు పలు సెక్షన్లతో బెదిరించి పంచులతో పంచానామాలో సంతకాలు చేయించి తప్పుడు కేసు నమోదు చేయడంతో పాటు, 2022 సంవత్సరంలో క్రైం నంబర్ 310 లో 420 సెక్షన్ క్రింద నమోదైన కేసులో ఇన్స్ స్పెక్టర్ శ్రీధర్ గౌడ్ నిందితుడికి అనుకూలంగా వ్యవహారిస్తూ కేసు దర్యాప్తు స్థితిగతులు తెలిపే యూఐ కేసుల జాబితాలో కూడా సదరు కేసును లేకుండా చేసి,ఈ కేసు పూర్తిగా సివిల్ తగాదా పరిధిలోకి వస్తుందని కోర్టును తప్పుదోవ పట్టించినట్లుగా ఇన్స్ స్పెక్టర్ పై ఫిర్యాదు రావడంతో ఖమ్మం సిపి విచారణ జరిపి అందజేసిన నివేదికలో ఇన్స్ స్పెక్టర్ అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో పోలీసుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించినందుకు ప్రస్తుతం ములుగు జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న ఇన్స్ స్పెక్టర్ సిహెచ్ శ్రీధర్ గౌడ్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఉత్తర్వులను జారీ చేశారు.మరో ముగ్గురు ఇన్స్ స్పెక్టర్ల స్థాయి అధికారులను మల్టీ జోన్ 1 ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
ఇటీవల మెదక్ జిల్లా పరిధిలో జరిగిన మతకల్లోల సమయంలో మెదక్ పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్ లకు చెందిన ఇన్స్ స్పెక్టర్లు ఎస్ దిలీప్ కుమార్,బి కేశవులు మతకల్లోలాలు జరిగిన సమయంలో విధులు నిర్లక్ష్యంగా వహించినందుకు గాను మెదక్, పట్టణ,రూరల్ ఇన్స్ స్పెక్టర్లతో పాటు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవాని సేన్ కేసు వ్యవహారంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఎస్ఐ పనితీరు వ్యవహార శైలిపై పర్యవేక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మహదేవ్ పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వర్ రావును మల్టీ జోన్ 1 ఐజీ కార్యాలయంకు అటాచ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.