★అంతరించిపోతున్న ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయ డోలు వాయిద్య కళకు కేంద్ర ప్రభుత్వం చే పద్మశ్రీ పురస్కారం
★మేడారం సమ్మక్క-సారక్క వనదేవతలకు ఆయన డోలు వాయిద్యం వాయిస్తూ పూజలు నిర్వహిచే వారు
★ చత్తీస్గడ్ రాష్ట్రంలో కూడా ఆయన ప్రదర్శనలు ఇచ్చేవారు
★ పద్మశ్రీ ఎంపికైనందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి రూపాయల రివార్డ్ ప్రకటన
★ ఆ రివార్డ్ అందుకోకుండానే కన్నుమూసిన పద్మశ్రీ సకిని
★ శోక సముద్రంలో మణుగూరు
★ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి, పినపాక ఎమ్మెల్యే పాయం, మాజీ రేగా కాంతారావు లు సంతాపం ప్రకటించారు
★ పద్మశ్రీ రామచంద్రయ్యకు ఘన నివాళి అర్పించిన భద్రాద్రి జిల్లా కలెక్టర్
★ ప్రభుత్వ లాంఛనాలతోనే పద్మశ్రీ సకిని అంత్యక్రియలు: జిల్లా కలెక్టర్
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్, మణుగూరు: ఆయన డోలు వాయిద్యంతో ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క సారక్క వనదేవతలకు పూజలు నిర్వహిస్తారు…. ముత్తాతలు..
తాతలు… తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన ఆదివాసి సంస్కృతి సాంప్రదాయ డోలు వాయిద్య కళకు పెట్టింది పేరు పద్మశ్రీ సకిని రామచంద్రయ్య. అలాంటి గొప్ప వ్యక్తి ఇక లేరు. ఆదివారం సకిని రామచంద్రయ్య(65) అనారోగ్యంతో బాధపడుతూ మణుగూరు లోని తన నివాసంలో మృతి చెందాడు. ఆయన గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధి సమస్యతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
★సకిని నేపథ్యం ఇదే★
సకిని రామచంద్రయ్య తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం కూనవరం గ్రామంలో 1956 లో సకిని ముసలయ్య, గంగమ్మ దంపతులకు జన్మించాడు. రామచంద్రయ్య తన తాత ముత్తాతల కాలం నుండి వారసత్వంగా వస్తున్న డోలు వాయిద్య కలను నేర్చుకున్నారు. కోయ తెగకు చెందిన సకిని రామచంద్రయ్యకి భార్య బసవమ్మ ముగ్గురు కుమార్తెలు ఒకకుమారుడు సకిని బాబురావు ఉన్నారు.
★2022 లో పద్మశ్రీ పురస్కారం★
డోలి వాయిద్య జానపద కళకు గాను 2022 లో కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ కి ఎంపికయ్యారు.28.03.2022 న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు సకిని రామచంద్రయ్య అందుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి రూపాయల రివార్డు ప్రకటించారు. చివరకు ఆ రివార్డు అందుకోకుండానే మృతి చెందడం గమనార్హం.
★డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి,ఎమ్మెల్యే పాయం, మాజీ ఎమ్మెల్యే రేగా, ఆదివాసి సంఘాల నాయకుల సంతాపం★
పద్మశ్రీ శకని రామయ్య మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి,ఎమ్మెల్యే పాయం, మాజీ ఎమ్మెల్యే రేగా, ఆదివాసి సంఘాల నాయకుల సంతాపం వ్యక్తం చేశారు. ఆదివాసి సమాజానికి ఆయన మృతి తీరని లోటు అని పేర్కొన్నారు.
★పద్మశ్రీ సకినికి ఘన నివాళి అర్పించిన జిల్లా కలెక్టర్★
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ పద్మశ్రీ సకిని రామచంద్రయ్య పార్థివ దేహాన్ని కూనవరంలోని సకిని స్వగృహంలో సందర్శించి ఘన నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో రామచంద్రయ్య అంత్యక్రియలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
★శోకసముద్రంలో మణుగూరు★
మణుగూరు పట్టణ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించడంలో పద్మశ్రీ సకిని రామయ్య సేవలు మరులేని. తన సాంప్రదాయ డోలు వాయిద్య కళకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మశ్రీ అవార్డు అందుకోవడంతో మణుగూరు పేరు ప్రపంచవ్యాప్తంగా మారి మోగిపోయింది. అంత గొప్ప కళాకారుడు మృతి చెందడంతో మణుగూరు శోకసముద్రంలో మునిగిపోయింది.
★ నాటి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ. కోటి అందుకోకుండానే మృతి★
2022 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పురస్కారం పద్మశ్రీకి సకిని రామచంద్రయ్య ఎంపికైన నేపథ్యంలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి ఇల్లు ఇంటి స్థలం కొరకు కోటి రూపాయల రివార్డు ప్రకటించారు. ఆనాటి నుండి తన రివార్డు కోసం కలెక్టర్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. ఫలితం శూన్యం. చివరకు రివార్డ్ అందుకోకుండానే రామచంద్రయ్య తుది శ్వాస విడిచారు.