అడ్మిషన్ల పేరుతో వేల రూపాయల అక్రమ వసూళ్లు
★పైవేట్ పాఠశాల దోపిడీ పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
★ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
★నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ ( NSF ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్
నేటి గదర్ న్యూస్ ,పినపాక :
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల దోపి డికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపార రంగంగా మార్చి అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు పాతరేసి అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేల రూపాయల వసూళ్లు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత విద్యాశాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు లబోదిబోమం టున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు తెలిపిన వివ రాల ప్రకారం కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో దాదాపు లక్షకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్ కోసం తల్లిదం డ్రులు ప్రభుత్వ విద్య కన్నా ప్రైవేట్ విద్య వైపే ఎక్కువగా మొగ్గు చూపుతు న్నారు. తమ తహతకు మించి ప్రైవేట్ పాఠశాలల్లో యాజమాన్యాలు అడిగి
నంత ఫీజులను చెల్లిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన నిర్వహ కులు దోపిడికి తెరలేపారు. పిల్లలకు అందిస్తున్న బోధన ఫీజు విషయం పక్కనపెడితే అడ్మిషన్ల పేరుతో వేల రూపాయలను ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశా లల్లో నూతనంగా చేరిక అయ్యే ఏ విద్యార్ధి కూడా ఒక్క రూపాయి కూడా అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కాని దీనికి విరు ద్దంగా ఒక్కోక్క అడ్మిషన్కు రూ.2వేల నుండి 3వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. ఈ దోపిడి పినపాక,మణుగూరు, పరిధిలో ఎక్కువగా ఉంది. కేంద్రంలో ఉన్న పాఠశాలలో ప్రధానంగా విద్యాసంస్థల యాజమాన్యాలు చదువు అంతంత మాత్రమే అంది స్తున్నా ఫీజులు మాత్రం కార్పోరేట్కు ధీటుగా వసూళ్లు చేస్తూ తమ విద్యాసంస్థలను ప్రతి విద్యా సంవత్సరం విస్తరిస్తున్నారు.
పినపాక, మణుగూరు ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశా లల్లో యాజమాన్యాలు ప్రభుత్వం నుండి అనుమతులు
పాఠశాల
విద్యార్థులకు బోధన మాత్రం మరో చోట చెబుతున్నారు. ప్రభుత్వం నుండి పాఠ శాల అదనంగా ఫీజుల్లో వసూలు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కళ్ల ఎదుటే ప్రైవేట్ పాఠశాలల
యాజమాన్యం తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుపోతున్న పట్టించుకున్న నాధుడే లేడు. ఇది ఇలా ఉంటే 50 మంది విద్యార్థులు దాటితే సెక్షన్ కోసం విద్యాశాఖ నుండి తప్పనిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. సెక్షన్కు 45 మంది విద్యార్థులకు విద్యబోధన చేయాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విద్యాశాఖకు కొంత మొత్తాన్ని చెల్లించడంతో పాటు అన్ని వసతులు విద్యార్థులకు కల్పించాలి. ఇలాంటివి ఏవి పట్టించుకోకుండానే అదనపు సెక్షన్లు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
★పట్టించుకోని అధికారులు
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల దోపిడి కళ్ల ముందే కనపడు తున్నా సంబంధిత విద్యాశాఖ అధికారులు పట్టిపట్టనట్లుగా వ్యవహ రిస్తున్నారు. పాఠశాలల యాజమాన్యాలు ఏ రాజకీయ పార్టీ అధికా రంలో ఉంటే ఆ పార్టీ నేతలకు అంటకాగుతూ అధికారులు అడిగి నంత ఇస్తూ ధనార్జనే ధ్యేయంగా విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇచ్చే మాముళ్లతోనే వారి విద్యా సంస్థల వైపు అధికారులు కన్నేత్తి చూడడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి వీరి దోపిడికి అట్టుకట్ట ప్రజలు కోరుతు న్నారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం ఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు గోగు శ్రీనివాస్, మండల అధ్యక్షులు జిమ్మిడి రాహుల్, దుర్గం సురేందర్ ప్రసాద్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.