★ పంచాయతీ కార్మికుల కుటుంబ పోషణ జరిగేది ఎట్లా?
★ గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి
★ ప్రతి నెల 5వ తేదీ లోపు జీతాలు చెల్లించాలి,
★ జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలి.
★ ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి.
నేటి గదర్ న్యూస్,పినపాక:
తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో జిపి కార్మికుల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, జీతాలు పెంచాలని,
పినపాక ఎంపీడీవో, ఎంపీవో లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పెరిగిన ధరల కనుగుణంగా గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు జీవో నెంబర్ 60 ప్రకారం పెంచాలని డిమాండ్ చేశారు .సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదని ఆరోపించారు. గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని జీవో నెంబర్ 60 ప్రకారం స్వీపర్లకు 15,600 బిల్ కలెక్టర్లు కరోబార్లకు 19500 కంప్యూటర్ ఆపరేటర్లకు 22వేల 750 వేతనంగా ఇవ్వాలని అన్నారు. పెరిగిన జనాభా కనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని ప్రతినెల 5వ తారీఖున వేతనం ఇవ్వాలని అన్నారు. జీవో నెంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు .కరోబార్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించి పంచాయతీ అసిస్టెంట్స్ గా నామకరణం చేయాలని. ప్రతి వర్కర్ కు 500000 ఇన్సూరెన్స్ అమలు చేయాలి. అదేవిధంగా ప్రమాద బీమాకు పది లక్షలు, దహన సంస్కారాలకు 30000 ఇవ్వాలని, ఏడాదికి మూడు జాతుల యూనిఫామ్ ,చెప్పులు, సభ్యులు నూనెలు ఇవ్వాలని అన్నారు. ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేస్తూ ఆదివారం పండుగ సెలవులు జాతీయ అంతర్జాతీయ సెలవు దినాలను అమలు చేయాలని కార్మికుల అక్రమ తొలగింపులు వేధింపులు ఆపాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గాదె. వెంకట్రావు, పొన్నగంటి. రామకృష్ణ, దొడ్డ. చంటి, వల్లెపు. సంపత్, పీరయ్య, బిజ్జా. బాలరాజు, నాగరాజు, బూరా. శ్రీను, తిరుపతయ్య, భద్రమ్మ, ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.