ఏరియా కమిటీలకు ట్రైనింగ్..
కూంబింగ్లో ప్రింటింగ్ సామాన్ల నకిలీ నోట్లు స్వాధీనం..
చత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా ఎస్పీ కిరణ్ చౌహన్ వెల్లడి.
నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
భద్రాచలం చత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ దండకారణ్యంలో మావోయిస్టులు ఫేక్ కరెన్సీ ముద్రిస్తున్నట్లు సుక్మా జిల్లా పోలీసులు తెలిపారు. ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ పై ప్రత్యేకంగా ఏరియా కమిటీలకు ట్రైనింగ్ఇస్తున్నట్లుగా గుర్తించారు. కూంబింగ్ఆపరేషన్లో భాగంగా ఆదివారం సుక్మా జిల్లా బెజ్జి పోలీస్స్టేషన్పరిధిలోని కోరాజ్గూడ వద్ద ట్రైనింగ్క్యాంపుపై డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, సీఆర్పీఎఫ్ జవాన్లు దాడి చేశారు. క్యాంపులో ప్రింటింగ్కు సంబంధించిన పలురకా వస్తువులను, రూ.43వేల నకిలీ కరెన్సీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
భారీగా ఫేక్ కరెన్సీ ప్రింటింగ్
ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న మావోయిస్టు పార్టీ ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ చేపట్టింది. మావోయిస్టు అగ్రనేతలు ప్రింటింగ్లో ట్రైనింగ్ తీసుకున్నారు. ప్రతీ ఏరియా కమిటీకి రెండు నెలలు ట్రైనింగ్ ఇస్తున్నారు. వారికి నిత్యం డబ్బులు, సరుకులు సప్లై చేసే టీం చైన్ లింక్ను మేము భగ్నం చేశాం. దీంతో డబ్బులు లేక దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ చేపట్టినట్లుగా తెలుస్తున్నది.
-కిరణ్ చౌహాన్, సుక్మా ఎస్పీ…