★గత ప్రభుత్వం రామచంద్రయ్యకు ఇచ్చిన హామీపై కలెక్టర్ తో చరవాణిలో మాట్లాడిన: తుమ్మల.
★మీ కుటుంబానికి అండగా ఉంటానన్న మంత్రివర్యులు: తుమ్మల నాగేశ్వరరావు.
నేటి గధర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 26:
మణుగూరు మండల పరిధిలోని కూనవరం గ్రామపంచాయతీ లో గల కూనవరం గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతూ మరణించినారు.ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మణుగూరు మండల పర్యటనలో భాగంగా సకిని రామచంద్రయ్య స్వగ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెబుతూ మీరు మనోధైర్యం కోల్పోవద్దని మీకు అండగా నేను ఉంటానని వారి కుటుంబానికి హామీ ఇచ్చారు. అనంతరం రామచంద్రయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య మరణించడం చాలా బాధాకరమైన విషయమని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం దారుణం అన్నారు. తక్షణమే స్పందించిన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్ కి ఫోన్ చేసి గత ప్రభుత్వం రామచంద్రయ్యకు ఇస్తానన్న కోటి రూపాయలు ఇంటి స్థలం తదితర అంశాలపై కలెక్టర్ తో మాట్లాడి వెంటనే ఫైల్ తయారు చేసి ఇవ్వమని కలెక్టర్ ను కోరారు.నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సీఎం రేవంత్ రెడ్డి తో మీకు న్యాయం చేస్తానని వారి కుటుంబానికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య సతీమణి, కుమారుడు సకిని బాబురావు,వారి బంధువులు తదితరులు పాల్గొన్నారు.