నేటి గద్దర్ హుకుంపేట న్యూస్:
అల్లూరి జిల్లా, హుకుంపేట మండలం లోని,భీమవరం పంచాయితీ, గుమ్మడి గండువ గ్రామంలో త్రాగునీటి సమస్య పరిస్కారం కోసం, గుమ్మడిగండువ గ్రామస్థులు ఇంటింటా 3 వేలు చందాలు వేసుకుని పైప్ లైన్ ఏర్పాటు చేశారని దిన పత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో హుకుంపేట వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండల రావు, ఐటీడీఏ పీఓ అభిషేక్ దృష్టికి తీసుకెళ్లారు,స్పందించిన పీఓ
ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ రమేష్ బాబు ను గ్రామానికి పంపారు.గ్రామంలో పర్యటించిన వైస్ ఎంపీపీ , ఏ ఈ, గ్రామం లో 5 వందల మీటర్ల పైప్ లైన్, 5 టేపులు,5 వేలు లీటర్లు సామార్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం భీమవరం పంచాయితీ సర్పంచ్ నైని సన్నీ బాబు, సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఉదయ్ శ్రీ,
మెరక చింత మాజీ సర్పంచ్, సీపీఎం పార్టీ మండల కార్యదర్శి వలసనైని లక్ష్మణ్ రావు,సీపీఎం నాయకులు తూబూరు కోటిబాబు,
వార్డ్ మెంబర్ కిల్లో వెంకట రావు, వాలంటీర్ మర్రి రాంబాబు, గ్రామస్తులు మర్రి బాలన్న, కిల్లో అప్పారావు,కిల్లో బాబూ రావు,మర్రి భద్రి తదితరులు పాల్గొన్నారు.