.
★పారిశుద్యంపై ప్రత్యేక దృష్టి సారించండి ఎంపీడీవో దేవ వర కుమార్
★గ్రామీణ వైద్యులు వారి స్థాయికి మించి వైద్యం చేయొద్దు వైద్యాధికారి కారం మధు
నేటి గద్దర్ కరకగూడెం: సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ రేగా కాళికా,ప్రభుత్వ వైద్యులు కారం మధు, ఎంపీడీవో దేవ వరకుమార్ అన్నారు.డిహెచ్ఎంఓ భాస్కర్ నాయక్ ఆదేశాల మేరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఆశా కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ రేగా కాళికా హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని ఇంటి చుట్టుపక్కల నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఇంటి నలుమూలల చెత్తాచెదారాలు లేకుండా చూసుకోవాలని, ఎవరికైనా జ్వర లక్షణాలు ఉంటే ప్రభుత్వం వైద్యశాలకు వచ్చే పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం వైద్యశాలలో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు.ప్రజలందరూ ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఎంపీడీవో దేవ వరకుమార్ మాట్లాడుతూ. 16 పంచాయతీలలో పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు. వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉండడంతో ఇంటి చుట్టుపక్కలలో నీటి నిల్వలు లేకుండా నిత్యం బ్లీచింగ్ చేయిస్తూ చూడాలని కార్యదర్శులను ఆదేశించారు. ఈ సందర్భంగా వైద్య అధికారి కారం మధు మాట్లాడుతూ. మండలంలోని ప్రజలు ప్రభుత్వ వైద్యశాలలో అందిస్తున్న అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. గ్రామీణ వైద్యులు స్థాయికి మించి వైద్యం చేయొద్దని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అని ఆయన అన్నారు. డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వ్యాధులు వస్తే తక్షణమే ప్రభుత్వ వైద్యశాలకు తెలియజేయాలని అని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పదహారు గ్రామపంచాయతిల కార్యదర్శిలు, ఆశ వర్కర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.