★భద్రాద్రి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు…
★గోదావరి వరదలపై కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష…
★మాతృవియోగం చెందిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును,పద్మశ్రీ ఆవార్డు గ్రహీత సకిన రాంచంద్రయ్య కుటుంబాలను పరామర్శ…
భద్రాద్రి,మణుగూరు లలో హెలిప్యాడ్ వద్ద భారీ బందోబస్తు…
నేటి గదర్ న్యూస్,(స్టేట్ బ్యూరో)జూన్ 26:
నైనారపు నాగేశ్వరరావు✍️
భద్రాద్రి జిల్లాలో రాష్ట్ర మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,రెవిన్యూ,గృహ నిర్మాణ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు,రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించనున్నారు.గురువారం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి కొత్తగూడెంకు బయలుదేరి 10.40 గంటలకు కొత్తగూడెంలోని ప్రగతిమైదాన్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క,ఇతర మంత్రులకు కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు,జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ,ఐటీడీఏ పీఓ,జిల్లా ప్రజాప్రతినిధులు ఇతర అధికారులు స్వాగతం పలకనున్నారు.విద్యానగర్ డిస్టిక్ మినరల్ ఫండ్స్ రూ.4కోట్లతో సైడ్ డ్రైన్ పనులకు శంకుస్తాపన చేసిన ఆనంతరం పోస్టు ఆఫీసు సమీపంలో అమృత్ 2 కోట్ల నిధులు,రూ.124 కోట్లతో కొత్తగూడెం మున్సిపాలిటికి శాశ్వత మంచినీటి సరఫరా పథకం పనులకు శంకుస్థాపన చేయనున్నారు.అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు.మధ్యాహ్నం 12.15 గంటలకు కలెక్టరేట్ చేరుకొని వర్షకాల నేపథ్యంలో గోదావరి వరదలు వస్తే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు కొత్తగూడెం నుంచి హెలిక్యాప్టర్ లో బయలుదేరి మణుగూరుకు చేరుకుంటారు.ఆ తరువాత సహచర మంత్రులతో కలిసి మాతృవియోగం పొందిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను,పద్మశ్రీ ఆవార్డు గ్రహిత సకిన రాంచంద్రయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాడ సంతాపం సానుభూతి తెలియజేస్తారు.డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క,ఇతర మంత్రుల పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం,మణుగూరు లలో హెలిప్యాడ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకొని మణుగూరు నుండి హైదరాబాద్ కు చేరుకుంటారు.