*ఒకప్రక్క గ్రామసభ – మరోప్రక్క గిరిజనుల నిర్మాణాలు తొలగింపు!*
*గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలు పదిలం.*
ఇదెక్కడి న్యాయం? గిరిజన సంఘం మండిపాటు!
నేటి గద్దర్ హుకుంపేట న్యూస్:
అల్లూరి జిల్లా హుకుంపేట మండలం ఈ రోజు పంచాయితీ గ్రామసభ సచివాలయంలో జరుగుతుంటే,మరోపక్క గిరిజన మహిళా కోరబు సుహాసిని,భర్త కొటిబాబు నిర్మించుకున్న నిర్మాణాన్నీ రెవెన్యూ అధికారులు తొలగించడం హేయమైన చర్య అని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు,మండల కార్యదర్శి తాపుల. కృష్ణారావు, కే.రామారావు పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. పీసా గ్రామసభ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ చట్టం,మా రాజ్యంలో మాదే అధికారం ఈ సూత్రం పూర్తిగా ఉల్టా అయిపోయింది. హుకుంపేట పంచాయితీ గ్రామసభలో గిరిజనులకు మేలుకంటే కీడే ఎక్కువ చేస్తోంది.గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది.అనధికారిక తీర్మానాలను అందజేస్తుంది.గిరిజనులకు,గిరిజనేతరులకు మధ్య భూ క్రయ విక్రయాలకు,గిరిజ నేతరులు చేపడుతున్న అక్రమ నిర్మాణాలకు సంపూర్ణ మద్దతు తెలియ జేస్తుంది.గిరిజనేతరులు బుడ్డిగ కొండమ్మా, మహ్మద్ ఆలీ,దొడ్డి ప్రసాద్,షేక్ వహీద్,షేక్ ఖాదర్ సోమలింగం తోపాటు మరికొందరు నిర్మించిన,నిర్మిస్తున్న నిర్మాణాలే అందుకు నిదర్శనం అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయం ఉపాధి పొందడం కోసం సుహాసిని కుట్టుమిషన్,భర్త మైక్ అండ్ లైటింగ్ సామానులు పెట్టుకోవడానికి 2004 సంవత్సరంలో ఒక దుకాణం నిర్మించు కొంటున్నారు.దాన్ని కొంతమేర రిపేరు చేసుకొంటే,ఇది అక్రమ నిర్మాణం అని వాటిని తొలగించడానికి అధికారులు పూనుకోవడం సమంజసం కాదన్నారు.
5వ షెడ్యూల్ ప్రాంతంలో అక్రమ వలస దారులైన గిరిజనేతరులు ఎట్టి పరిస్థితుల్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టాకూడదని భుబధలయింపు నిషేధ చట్టంలో స్పష్టంగా పేర్కొందని వారు తెలియజేశారు.
అయినప్పటికీ మండల కేంద్రంలో విపరీతంగా గిరిజనేతరులు అక్రమ బహుళ అంతస్తులు నిర్మాణాలు చేపడుతున్నారు.
వాటన్నిటిపైన అనేక మార్లు గిరిజన సంఘం అధికారులకు పిర్యాదు చేసిందని వారు గుర్తు చేశారు.కనీసం స్పందించిన పాపాన పోలేదని వారు మండి పడ్డారు.
ఇప్పటికే గిరిజనులు నిర్మించుకున్న ఐదు నిర్మాణాలను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. గంజాయి.రాజేంద్రప్రసాద్ కొర్లాబు.సూర్యమణి,కొర్ర.కాసులమ్మ.గొల్లోరి.వెంకటరమణ, కోరాబు సిహాసిని లు సర్వహక్కులు కలిగిన ఆదివాసులు, వీరు చేపట్టిన సక్రమ నిర్మాణాలను కల్చివేయడం తీరు చూస్తుంటే రెవెన్యూ అధికారులు 1/70 చట్టాన్ని గిరిజనేతరుల రక్షణ చట్టంగా మార్చేసేరని వారు విమర్శించారు.
చట్టంపై అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ఎస్ డి సి వ్యవస్థ ఉండి లేనట్టే అన్నారు,కలక్టర్,పిఓ,సబ్ కలెక్టర్ లు గిరిజన ఆదివాసీ చట్టాల ఉల్లంగాణాలపై అలసత్వం హిస్తూన్నారు.ఆదివాసీ ప్రజాప్రతినిధులు 1/70 చట్టాన్ని ఓటు బ్యాంకుగా మార్చు కొంటున్నారు.కాబట్టే ఆదివాసీ గిరిజన సంఘం చట్టం పరిరక్షణ కోసం రోడ్లపై కొచ్చి ఉద్యమిస్తుందన్నారు.చట్టం చేతిలో తీసుకోక తప్పలేదన్నారు.
వీటన్నింటిపై భవిషత్ లో చేపట్టే ఉద్యమానికి ఆదివాసులు మద్దతు ఇవ్వాలనీ వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి గిరిజన సంఘం నాయకులు రామారావు,ఆనంద్, పాల్గొన్నారు.