★గిరిజనుడి షాపు కు తాళం
వేసిన హుకుంపేట గిరిజనేతర వైస్ సర్పంచ్ కోడి దాసు గోవింద్
నేటి గద్దర్ హుకుంపేట న్యూస్:
అల్లూరి జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో గిరిజనుడు కానీ, గిరిజనేతర వైస్ సర్పంచ్ కోడిదాసు గోవింద్, దౌర్జన్యాలు, మోసాలు, దందాల కు అడ్డు అదుపు లేకుండా పోతుంది,కొందరు గిరిజన నాయకుల అండాతో…
తన గిరిజన బినామీ గడుతూరి చిన్న బాబు తో కలిసి, దౌర్జన్యం గా జన్ని ప్రశాంత్ అనే గిరిజనుడు
రోడ్ పక్కన ప్రభుత్వం భూమిలో ఏర్పాటు చేసుకున్న
ఇంటర్ నెట్ షాపు కు, తనదే ననీ,తాళం వేసిన ఘటన హుకుంపేట మండల కేంద్రం లో చోటు చేసుకుంది.
వివరాల్లో కి వెలితే… కోడి దాసు గోవింద్ గిరిజనుడు కాదు, ఐనా సరే… గిరిజనులనే తన బినామీలు గా మార్చుకుని,గిరిజన నాయకుల అండా తో…
మొదమాంబ గుడి పక్కనే ఓ త్రిబుల్ బెడ్ రూమ్ స్లాబ్ ఇల్లు, పెట్రోల్ బంక్ ఎదుట టిఫిన్ సెంటర్, కిరాణా షాపు,ఆటో బైక్ మెకానిక్ స్పెర్స్ షాప్, అంబేద్కర్ విగ్రహం వెనకాలే రెండు పోర్షన్ ల పెంకుటిల్లు, ఆ ప్రక్కనే రెండు పోర్షన్ ల బేస్ మెంట్ ఉంది, ఐనా కక్కుర్తి తీరక, హుకుంపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో కాంపౌండర్ గా పనీ చేస్తున్న గడుతూరి చిన్న బాబు ను బినామీ గా చేసుకుని,ఇంటర్ నెట్ షాపు కు తాళం వేశాడు, గోవింద్ గిరిజను డు కాదు, అతను షాపు లు ఇల్లు కట్టు కోకూడదు, ఐనా సరే,వైస్ సర్పంచ్ పదవి, తో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది, గోవింద్ అతని కుటుంబం పై కఠిన చర్యలు తీసుకోవాలని, అతని ఇల్లు శాపులు కూల్చాలని
గిరిజన ప్రజా సంఘల నేతలు డిమాండ్ చేస్తున్నారు.గిరిజను లంతా ఏకమై గోవింద్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.