పుట్టింది ఆడబిడ్డ అని కళ్లు తెరవకముందే అమ్మకానికి..
నేటి గదర్ న్యూస్ ,జులై 9 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
ఆ తల్లికి మనస్సు ఎలా వచ్చిందో నవ మాసాలు మోసి ప్రేగు పచ్చి అరకముందే పుట్టిన పసికందును అమ్మిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేకల తండా గ్రామ పంచాయతీ పరిధి కొక్య తండాకు చెందిన ఓ దంపతులకు మొదట ఇద్దరు ఆడపిల్లలు ఈసారి కూడా మళ్ళీ ఆడపిల్ల పుట్టడంతో బరువు అనుకున్నారేమో బయట అమ్మేసి చనిపోయినట్టుగా ఆశ వర్కర్ అంగన్వాడీ టీచర్ వి.జయమ్మ కు చెప్పింది. అయితే వారం రోజుల పాటు తల్లికి ఫీడింగ్ ఇచ్చిన అంగన్వాడీ టీచర్ ఎన్.ఎస్.టిఎస్ యాప్ ద్వారా ఆన్లైన్ చెయ్యాల్సి ఉంటుంది. ఇదే విషయంపై సూపర్వైజర్, అంగన్వాడి టీచర్ ఆరా తీయడంతో పాప తల్లి ద్వారా అసలు విషయం బయటకు వచ్చింది. పాపని పుట్టిన వెంటనే అమ్మేశామని అన్నారని తెలిపారు. దీనిలో ఓ ఆర్ఎంపి పాత్ర ఉన్నట్టు ఆరోపించారు. ఇదే విషయం సిడిపిఓ బాల త్రిపుర కి తెలియపరచి ఆ నాలుగు నెలల పసికందును తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చారు. అయితే దీనంతటికీ కారణం తండా అంగన్వాడీ టీచర్ జయమ్మ ద్వారానే బయటికి వచ్చిందంటూ ఆశ వర్కర్ బోడ సుజాత ఆ కుటుంబీకులను వుసిగొలపడంతో అంగన్వాడి కేంద్రం దగ్గరికి వచ్చి డ్యూటీలో ఉన్న టీచర్ ను నోటికి వచ్చిన భూతులతో దుర్భాషలాడుతూ మానసిక క్షోభకు గురి చేశారని వి.జయమ్మ ఆరోపించారు. దీనిపై సిడిపిఓకి కంప్లైంట్ చేసినప్పటికీ పట్టించుకోకపోగా వారికే వత్తాసు పలుకుతుందని దీంతో వారు రెచ్చిపోయి నా మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. గతంలోనూ ఇలాంటివి చాలా జరిగాయని అన్నారు. దీనిపై ఉన్నతాధికారులు,జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని అంగన్వాడి టీచర్ కోరారు.