నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
మంత్రి సీతక్క నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. కలెక్టరేట్ లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవంతో పాటు, దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే వాహనాలు, చక్రాల కుర్చీల పంపిణీ చేయనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మహిళా శిశు సంక్షేమంపై సీతక్క సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. నాసిరకం గుడ్లు సరఫరాపై నివేదిక కోరారు. నాణ్యమైన సరుకులు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లేకపోతే అంగన్వాడీ టీచర్లు, స్థానిక అధికారులను బాధ్యుల్ని చేయాల్సి వస్తుందన్నారు.
Post Views: 78