తహసిల్దార్ సురేష్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చిన బీజేపీ నేతలు..
నేటి గదర్ న్యూస్ , జులై 9 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కూసుమంచి మండల బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ సురేష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మెమొరాండంలో డిమాండ్ తో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు…. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని ,ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయిన రైతులకు అందించే పెట్టుబడి సాయం అందకపోవడం , 2లక్షల రుణ మాఫీ హామీ కూడా అధికారంలోకి వచ్చి 200 రోజులు అవుతున్న రుణ మాఫీ కాలేదని ,రుణ మాఫీ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో కొత్త శ్రీనివాస్ రెడ్డి ,కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు గుండ ఉపేందర్ రెడ్డి ,బెల్లం మురళీ , వడ్డెంపూడి నరేష్ ,సోమనపల్లి వెంకన్న ,బద్దం వెంకట్ రెడ్డి , బి మహేందర్ నాయక్, బి ఉపేందర్ నాయక్ ,గడ్డం వెంకటేశ్వర్లు ,ప్రభాకర్ ,గోవర్దన్ ,పిట్టల వేణు,జానకి రాముల పాల్గొన్నారు..